RRR: విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్న ఆడియన్స్..!!
ఈ సినిమా ఆస్కార్ బరిలో నిలచడంతో ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాని చూడాలని ఎంత ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు ఇతర దేశస్తులు. ఇప్పటికే ఈ సినిమా చూసిన హాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఫిదా అయ్యారని చెప్పవచ్చు. దీంతో ఇప్పుడు తాజాగా మళ్లీ చైనాలో ఈ సినిమాని విడుదల చేయాలని అక్కడ ఆడియన్స్ డిమాండ్ చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక గతంలో వివిధ దేశాలలో కూడా ఈ సినిమాను విడుదల చేసి పలు రికార్డులను సైతం అందుకున్నారు. మరి అక్కడి చైనా ప్రేక్షకులను ఉద్దేశించి రాజమౌళి ఈ సినిమాని అక్కడ విడుదల చేస్తారేమో చూడాలి మరి.
ప్రస్తుతం రాజమౌళి ఈ అవార్డు ఫంక్షన్లు అన్నిటిని ముగించుకొని.. మహేష్ బాబుతో తన తదుపరి చిత్రాన్ని తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాని కూడా అడ్వెంచర్ మూవీగా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ తెలియజేయడం జరిగింది. మహేష్ బాబుని ఇదివరకు ఎన్నడు చూడని విధంగా ఈ సినిమాలో చూడబోతున్నట్లు తెలియజేశారు. మహేష్ బాబు అభిమానులు కూడా ఈ చిత్రం కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందా అంటూ తెలియజేస్తున్నారు.