కృతి శెట్టి లైన్ అప్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!
ఇక ఆ తర్వాత నటించిన మూడు చిత్రాలు కూడా డిజాస్టర్ కావడం జరిగింది. దీంతో ఈ అమ్మడు కెరియర్ చాలా ఇబ్బందుల్లో పడిందని అందరూ అనుకున్నారు. అయితే ప్రస్తుతం ఇమే సినిమా లైన్ అప్ చూస్తూ ఉంటే అందరికీ షాక్ అయ్యే విధంగా కనిపిస్తోంది. చేతిలో నాగచైతన్య హీరోగా నటిస్తున్న కష్టడీ సినిమా మాత్రమే ఉంది అనుకున్నారు.అయితే ఈ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో నటుడు శర్వానంద్ తో మరొక సినిమాని మొదలుపెట్టింది. ఈ సినిమా అయిపోయిన వెంటనే తమిళంలో హీరో సూర్యగా తెరకెక్కిస్తున్న ఒక పాన్ ఇండియా చిత్రంలో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్గా కన్ఫర్మ్ అయినట్లు సమాచారం.
ఈ రెండు చిత్రాలతో పాటు మరొక ప్రాజెక్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మలయాళంలో ట్వినో తామస్ హీరోగా తెరకెక్కించబోతున్న పాన్ ఇండియా చిత్రంలో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్గా ఖరారు అయినట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మైత్రి మూవీస్ మేకర్స్ మలయాళం లో అడుగు పెట్టబోతున్నది. ఇలా రెండు పాన్ ఇండియా చిత్రాలతో మూడు భాషలలో కృతి శెట్టి హవా తగ్గలేదని నిరూపించుకుంటోంది .ఒకవేల ఈ సినిమాలన్నీ సక్సెస్ అయ్యాయి అంటే ఈ ముద్దుగుమ్మ కెరియర్ కచ్చితంగా మారిపోతుందని అభిమానులు భావిస్తున్నారు.