SSMB -29 : వల్ల మహేష్ కు ఆదరణ దక్కదా..!!
ముఖ్యంగా రాజమౌళి ఈ చిత్రాన్ని ఎలా తెరకెక్కించబోతున్నారు ఎలా ఉండబోతోంది అని అందరూ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు ఎంతగా నటించినా మహేష్ బాబుకు గుర్తింపు రాదని వార్తలు ఎక్కువగా సినీ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి ఎందుకంటే ప్రస్తుతం అంతా ఎక్కువగా రాజమౌళి పైనే హవా కొనసాగుతూ ఉంటోంది. దీంతో అభిమానులు కూడా ఈ విషయం తెలిసి కాస్త నిరుత్సాహపడుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి రాజమౌళి కానీ, మహేష్ బాబు గాని ఈ విషయంపై ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.
కానీ మరి కొంతమంది అభిమానులు నేటిజెన్లు మాత్రం రాజమౌళి కచ్చితంగా మహేష్ బాబు కెరియర్ లోనే ఒక మైలురాయిగా నిలిచిపోయే చిత్రాన్ని తెరకెక్కిస్తారని నమ్మకాన్ని తెలియజేస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు మాత్రం త్రివిక్రమ్ డైరెక్షన్లో తన 28వ చిత్రంలో నటిస్తూ ఉన్నారు ఈ సినిమా షూటింగ్ కూడా ఇప్పటికే మొదలుపెట్టారు. ఈ సినిమా ఏడాది విడుదల చేసేందుకు పలు ప్రయత్నాలు చేస్తున్నారు ఈ చిత్రంలో పూజా హెగ్డే, శ్రీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరి రాజమౌళి సినిమా అంటే దాదాపుగా రెండు సంవత్సరాల వరకు సమయం పడుతుంది. మరి ఈ చిత్రం పైన ఎలాంటి అప్డేట్ ఇంతవరకు రాలేదు కేవలం స్టోరీ పరంగా విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాని చాలా అద్భుతంగా తెరకెక్కిస్తున్నానని తెలిపారు.