'కేరాఫ్ కంచరపాలెం' సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ లో ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకున్న చిత్రం 'కేరాఫ్ కంచరపాలెం'. లైఫ్ యాంథాలజీగా వచ్చిన ఈ సినిమాని యంగ్ డైరెక్టర్ వెంకటేష్ మహా డైరెక్ట్ చేశాడు.ఇక ఈ సినిమా తరువాత కూడా వెంకటేష్ మహా ఉమామహేశ్వర ఉగ్రరూపస్య వంటి డిఫరెంట్ స్టోరీతోనే వచ్చి ఆ సినిమాతో కూడా సూపర్ హిట్ కొట్టాడు. ఇక తాజాగా ఈ దర్శకుడు ఒక యూట్యూబ్ ఛానల్ లోని ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.ఇంకా ఈ ఇంటర్వ్యూలో వెంకటేష్ మహాతో పాటు టాలీవుడ్ లోని దర్శకులు నందిని రెడ్డి, ఇంద్రగంటి మోహనకృష్ణ, శివ నిర్వాణ ఇంకా వివేక్ ఆత్రేయ కూడా పాల్గొన్నారు.అయితే ఈ ఇంటర్వ్యూలో వెంకటేష్ మహా ఇండియన్ బ్లాక్ బస్టర్ మూవీ కేజీఎఫ్ పై సంచలన కామెంట్స్ చేశాడు. ఇక ఇక్కడున్న మేము ఐదుగురం ఇంకా మాలా సినిమాలు తీసే ఇండస్ట్రీలోని ఇంకొందరు డైరెక్టర్స్.. మేమందరం మా అభ్యుదయ భావాలను పక్కన పెట్టి వైలెన్స్ సినిమాలు తీస్తే వాళ్లకన్నా చాలా గొప్పగా తీయగలం, కానీ మేము అది ఇప్పుడు చేయడం లేదు. కొన్ని విలువలతో కూడిన సినిమాలు మాత్రమే తీస్తున్నాము వాటిని చూసి ఇవి ఓటిటి సినిమాలు అంటూ జనాలు డీగ్రేడ్ చేస్తున్నారు.
అదే సినిమా లాస్ట్ లో తవ్వినవాళ్లకి ఇందిరమ్మ పథకం కింద ఇల్లు ఇచ్చి ఇంకా ఆ బంగారాన్ని అంతా తీసుకోని వెళ్లి సముద్రంలో పడేసే నిచ్ కమీన్ కుత్తే గాడి మీద సినిమా తీస్తే మనం బాగా చప్పట్లు కొడుతున్నాము అంటూ కేజీఎఫ్ చిత్రం గురించి ఇన్‌డైరెక్ట్ గా కామెంట్స్ చేశాడు.అయితే వాటిని కమర్షియల్ సినిమాలు అంటున్నారు. అయితే ఇక్కడ మా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బడ్జెట్ కి ఎన్నో రెట్టింపు లాభాలు తెచ్చి పెడుతున్నాయి. కానీ 1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఆ సినిమాలు.. ఆ బడ్జెట్ పై కేవలం రెండు మూడు కోట్ల మాత్రమే తెచ్చిపెడుతున్నాయి. ఇక్కడ కమర్షియల్ గా ఏ దర్శకులు గొప్ప అంటూ కూడా అతను ప్రశ్నించాడు. ఇక కేజీఎఫ్ పై చేసిన వ్యాఖ్యలు గురించి సోషల్ మీడియాలో వెంకటేష్ మహాని భారీగా ట్రోల్ చేస్తున్నారు. ప్రతి సినిమా కూడా ప్రతి ఒకరికి నచ్చాలని రూల్ లేదు. కానీ మీకు నచ్చలేదని దానిని డీగ్రేడ్ చేసి మాట్లాడడం చాలా తప్పు అంటూ నెటిజెన్స్ ట్రోల్ చేస్తున్నారు.కొంతమంది ఈయనకి సపోర్ట్ కూడా చేస్తున్నారు.