శంకర్ డెడికేషన్ కి హ్యాట్సాఫ్?

Purushottham Vinay
తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం కమల్ హసన్ లీడ్ రోల్ లో ఇండియన్ 2 సినిమాని అలాగే రామ్ చరణ్ 15 వ సినిమాని ఒకేసారి తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో ఈ రెండు సినిమాలు తెరకెక్కుతున్నాయి.ఒక వారం రోజులు ఇండియన్ 2 మూవీ చేస్తూ ఉంటే మరో వారం రోజులు రామ్ చరణ్ సినిమా షూటింగ్ చేస్తున్నాడు శంకర్. ఒక టాప్ దర్శకుడు రెండు పాన్ ఇండియా సినిమాలని ఒకే సారి హ్యాండిల్ చేయడం అంటే ఆషామాషి విషయం కాదు. గతంలో దాసరి నారాయణరావు లాంటి లెజెండరి స్టార్ దర్శకులు ఇలా ఒకేసారి రెండు మూడు సినిమాలు చేస్తూ ఉండేవారు.అయితే ఆ ట్రెండ్ అనేది ఎప్పుడో పోయింది.అయితే శంకర్ మాత్రం ఇప్పుడు అలాంటి రేర్ ఫీట్ ని విజయవంతంగా రిపీట్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇండియన్ 2 మూవీ షూటింగ్ ని శంకర్ శరవేగంగా పూర్తి చేయడంపై ఫుల్ గా దృష్టి పెట్టాడు.



ఇక ఈ మూవీకి సంబందించిన ఇంటరెస్టింగ్ అప్డేట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. ఈ సినిమాకి సంబందించిన నైట్ సీక్వెన్స్ ని ప్రస్తుతం శంకర్ తెరకెక్కిస్తున్నారు అని సమాచారం తెలుస్తుంది.గత కొద్ది రోజులుగా ప్రతి రోజు రాత్రివేళలోనే ఈ సీన్స్ ని రియల్ డార్క్ లైట్ లో తీస్తున్నారు. ఇక జులై నెల ఆఖరుకి ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేయాలని శంకర్ డిసైడ్ అయినట్లు సమాచారం తెలుస్తుంది. దానికి తగ్గట్లుగానే షూటింగ్ వేగం పెంచారని సమాచారం తెలుస్తుంది. తరువాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసి దీపావళికి ప్రేక్షకులకి అందించాలనే లక్ష్యం పెట్టుకున్నారట. అలాగే RC 15 సినిమాని వచ్చే ఏడాది జనవరికి రిలీజ్ చెయ్యాలని ఫిక్స్ అయ్యాడట. అంత పెద్ద స్టార్ డైరెక్టర్ అయ్యుండి ఇలా విశ్రాంతి లేకుండా రెండు సినిమాలని చేస్తున్న శంకర్ డెడికేషన్ కి హాట్స్ఆఫ్ చెబుతున్నారు నెటిజన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: