ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా వెలుగుతోంది శ్రీ లీల. మొదట శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా నటించిన పెళ్లి సందడి సినిమాలో నటించి తెలుగు తెరకు పరిచయం అయింది ఈమె. ఆ సినిమా అంతగా హిట్ కాకపోయినప్పటికీ తన అందం మరియు నటనతో మంచి మార్కులే కొట్టేసింది ఈమె. దాని అనంతరం ఈమె సీనియర్ హీరోలు జూనియర్ హీరోలు అనే తేడా లేకుండా వరుసగా స్టార్ హీరోల సినిమాలలో నటిస్తూ దూసుకుపోతుంది .పెళ్లి సందడి సినిమా అనంతరం రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమాలో హీరోయిన్గా చేసింది ఈమె .
ఇక ఈ సినిమాలో రవితేజ కంటే శ్రీ లీలకే ఎక్కువ మార్కులు పడ్డాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే తాజాగా శ్రీ లీలకు వరుస సినిమా అవకాశాలు రావడానికి అంతేకాదు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఎదగడానికి కారణం ఒక పెద్ద స్టార్ హీరో అన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. శ్రీ లీలకి కొద్ది రోజుల్లోనే ఇంతటి గుర్తింపు రావడానికి ముఖ్య కారణం సూపర్ స్టార్ మహేష్ బాబు అని తెలుస్తుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సూపర్ స్టార్ మహేష్ బాబు పరోక్షంగా ఆమెకి సపోర్ట్ చేయడం వల్లే శ్రీలీలకి ఇలా వరుస స్టార్ హీరోల సినిమాలో అవకాశాలు వస్తున్నాయని అంటున్నారు.
ముఖ్యంగా ఈమె త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మొదట ఈ సినిమాలో మహేష్ బాబు కి జోడిగా పూజా హెగ్డే ని అనుకున్నారు. ఇక సెకండ్ హీరోయిన్ స్థానంలో శ్రీలీలని అనుకున్నారు. మహేష్ కి జోడిగా పెద్ద హీరోయిన్ ని తీసుకుంటారు అని అందరూ అనుకుంటున్నా సమయంలోనే ఈమెని ఈ సినిమాలో హీరోయిన్గా తీసుకొని ఒకసారి అందరికీ షాక్ ఇచ్చారు .ప్రస్తుతం మహేష్ బాబుని కాకుండా చాలామంది స్టార్ హీరోలు శ్రీ లీల నే తమ సినిమాలో హీరోయిన్ గా పెట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇక శ్రీలపై అంత నమ్మకం రావడానికి మహేష్ బాబు నీ కారణమని అంటున్నారు..!!