ప్రేక్షకులందరికీ రుణపడి ఉంటా..ఎమోషనల్ అవుతున్న జబర్దస్త్ వేణు..!

Divya
సాధారణంగా నటీనటులు దర్శకులు కావడం కొత్త ఏమీ కాదు అయితే టాలీవుడ్ లో కూడా ఈ లిస్టు ఇప్పుడే చాలా పెద్దదిగానే ఉంది. ముఖ్యంగా అందులో దర్శకులుగా బలమైన ముద్రవేసిన వాళ్ళు మాత్రం చాలా తక్కువ మందే ఉన్నారు. ఇప్పుడు చిన్న స్థాయి కమెడియన్ నుంచి దర్శకుడిగా మారాడు జబర్దస్త్ వేణు.. నిజానికి ఈయనను వేణు అంటే చాలామంది గుర్తుకు పట్టకపోవచ్చు కానీ జబర్దస్త్ వేణు అంటే మాత్రం వెంటనే ఇట్టే గుర్తుపట్టేస్తారు. జబర్దస్త్ కామెడీ షో లో స్కిట్లు చేసిన ఈయన మున్నా లాంటి సినిమాలలో కామెడీ రోల్స్ చేశాడు అంటే తప్ప ఆయనను గుర్తుపట్టడం చాలా కష్టం.
ఇలాంటి ఒక చిన్న స్థాయి కమెడియన్ ను  దిల్ రాజు లాంటి పెద్ద నిర్మాత ఆయన ప్రతిభను గుర్తించి తన నిర్మాణ సంస్థలో సినిమా తీయడం అంటే అది మామూలు విషయం కాదు.. చాలామంది ఈ విషయం తెలిసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు.  ఈ సినిమా ప్రోమోలు చూస్తే మాత్రం విషయం ఉన్నట్లే మనకు బాగా కనిపిస్తుంది. ఈరోజు థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా చూశాక వేణు లో ఎంత టాలెంట్ ఉందో ప్రజలకు కూడా బాగా అర్థమవుతుంది ఒక కమెడియన్ దర్శకత్వం చేశాడంటే కామెడీ ప్రధానంగా ఉంటుందని అందరూ అనుకుంటారు.  కానీ ఈ సినిమాలో కామెడీ అన్న మాట పక్కన పెడితే ఎమోషనల్ తో చూసిన వారి కంటే కన్నీరు తెప్పించింది.
కలసి ఉంటే కలదు సుఖం అన్న కథాంశం తో వచ్చిన ఈ సినిమా ప్రతి ఒక్కరిని హృదయానికి అడ్డుకుంది ఎవరైనా చనిపోతే కాకి  పిండాన్ని ముట్టే పాయింట్ మీద కథను మలుపు తిప్పుతూ ఎంగేజ్ చేసిన విధానం ప్రశంసనీయమని చెప్పాలి.  ఇకపోతే తాజాగా దర్శకుడు ఈ సినిమా విజయాన్ని తలచుకొని ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాను అంటూ ఎమోషనల్ కామెంట్లు చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది. ఏది ఏమైనా వేణు డైరెక్టర్ గా సక్సెస్ అయ్యారు అనడంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: