పెయింటింగ్ ఇలా కూడా వేస్తారా..?
ఇక లేటెస్ట్ గా దీప్తి పెయిటింగ్ వేస్తూ ఫోటో షూట్ చేసింది. క్యూట్ లుక్స్ తో కుర్రాళ్లని ఆకట్టుకుంటుంది అమ్మడు. పెయిటింగ్ వేయడం ఏమో కానీ తన ఒంటినిండా రంగులు పూసుకుంది దీప్తి సునైనా. సోషల్ మీడియాలో తనకున్న క్రేజ్ ని క్యాష్ చేసుకుంటూ రకరకాల ఫోటో షూట్స్ తో ఇంప్రెస్ చేస్తుంది అమ్మడు. లేటెస్ట్ గా షేర్ చేసిన ఈ పెయిటింగ్ ఫోటో షూట్ ప్రస్తుతం ఆమె ఫాలోవర్స్ వైరల్ చేస్తున్నారు. ఓ చిన్నపాటి హీరోయిన్ క్రేజ్ తెచ్చుకున్న దీప్తి సునైనా సినిమాల్లో మాత్రం నటించడానికి సుముఖంగా లేదని టాక్.
షణ్ముఖ్ తో స్పెషల్ సాంగ్స్ చేస్తూ క్రేజ్ తెచ్చుకున్న దీప్తి సునైనా అతనితో నాలుగు ఐదేళ్లు లవ్ ట్రాక్ నడిపించింది. అయితే షణ్ముఖ్ బిగ్ బాస్ సీజన్ 5 లో సిరితో క్లోజ్ అవడం వల్ల బయటకు వచ్చాక అతన్ని దూరం పెట్టింది దీప్తి. అయితే వారిద్దరు విడిపోయినప్పుడు వారి ఫ్యాన్స్ మాత్రం చాలా బాధపడ్డారు. ప్రస్తుతం తన స్పెషల్ సాంగ్స్ తో దీప్తి కెరీర్ కొనసాగిస్తుంది. పర్ఫెక్ట్ హీరోయిన్ మెటీరియల్ అయినా కూడా ఎందుకో అమ్మడు సినిమాలంటే మాత్రం ఆసక్తి చూపించట్లేదు.