చిరంజీవి సినిమాలను.. పూర్తిగా పక్కన పెట్టేసిన రామ్ చరణ్?

praveen
మెగాస్టార్ చిరంజీవి.. అతను అందరిలా ఒక సాదాసీదా స్టార్ హీరో కాదు ఇండస్ట్రీలోనే ఒక మహా వృక్షం అనే విధంగా ఆయన ప్రస్థానం సాగింది అన్న విషయం తెలిసిందే. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఒక సాదాసీదా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి అంచలంచలుగా ఎదిగిన విధానం నేటి రోజుల్లో ప్రతి యువకుడికి కూడా ఆదర్శప్రాయం అని చెప్పాలి. సమస్యలు వచ్చినప్పుడు వెనకడుగు వేయడం కాదు ధైర్యంగా నిలబడి ఎదుర్కోవాలి అని మెగాస్టార్ చిరంజీవిని చూస్తే అర్థమవుతుంది.

 ఎన్నో కష్టాలను ఎదుర్కొని ముందుకు కదలిన మెగాస్టార్ చిరంజీవి ఇక ఇప్పుడు ఇండస్ట్రీలో అత్యున్నత స్థానంలో కొనసాగుతూ ఉన్నారు అని చెప్పాలి. అయితే మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో ఎన్ని క్లాసిక్ హిట్స్ ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఇండస్ట్రీ రికార్డులను తిరగ రాసిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. ఇక మెగాస్టార్ చిరంజీవి గెలుచుకున్న అవార్డుల గురించి అయితే ఎంత చెప్పిన తక్కువే.అయితే సినీ ప్రేక్షకులను మీ ఫేవరెట్ మూవీస్ ఏవి అని అడిగితే దాదాపు మెగాస్టార్ సినిమాల పేర్లు ఎక్కువగా చెబుతూ ఉంటారు. కానీ మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ మాత్రం తన తండ్రి సినిమాలను పక్కన పెట్టేసాడు.  రామ్ చరణ్ కు నచ్చే ఒక సినిమా కూడా చిరంజీవి చేయలేదు అన్నట్లుగా మాట్లాడాడు.

 త్రిబుల్ ఆర్ సినిమా సూపర్ హిట్ తర్వాత గ్లోబల్ వైడ్ గా ఖ్యాతిని సంపాదించి ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నాడు రామ్ చరణ్. ఈ క్రమంలోనే అమెరికాలో పలు సంస్థలకు ఇంటర్వ్యూలు కూడా ఇస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే  ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మన దేశం నుంచి తనకు నచ్చిన ఆల్ టైం సినిమాల లిస్టు చెప్పమంటే.. ఇక అందరి సినిమాల పేర్లు చెప్పిన రామ్ చరణ్ తండ్రి చిరంజీవికి సంబంధించిన ఒక్క సినిమా పేరు కూడా చెప్పకపోవడం గమనార్హం. సీనియర్ ఎన్టీఆర్ దానవీరశూరకర్ణ, రాజమౌళి బాహుబలి, మిస్టర్ ఇండియా తో పాటు తన హిట్ మూవీ రంగస్థలం పేరు కూడా చెప్పాడు. కానీ మెగాస్టార్ సినిమాలను మొత్తంగా పక్కన పెట్టేసాడు. దీంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. అదేంటి తండ్రి చేసిన 150 కి పైగా సినిమాలలో చరణ్ కు  ఒక్క సినిమా కూడా నచ్చలేదా అని కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: