పెళ్లి సందడి అనే సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది శ్రీ లీల. ఇక ఈ సినిమాతో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీ లీల ఒక్కసారిగా ధమాకా సినిమాలో హీరోయిన్గా నటించే అవకాశాన్ని దక్కించుకుంది. మాస్ మహారాజా రవితేజ నటించిన ఈ సినిమాలో హీరోయిన్గా నటించే అవకాశాన్ని ఈమె అందుకోవడంతో టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కూడా పేరును సంపాదించుకుంది. ప్రస్తుతం ఎవరి నోట విన్నా కూడా శ్రీ లీల పేరే వినిపిస్తుంది. అంతేకాదు స్టార్ హీరోలు సైతం తన సినిమాలో శ్రీలీలను హీరోయిన్గా పెట్టుకునేందుకు ఎదురుచూస్తూ ఉన్నారు. దీంతో టాప్ డైరెక్టర్లనుండి స్టార్ హీరోల వరకు అందరూ ఈమె వెంట పడుతున్నారు.
ప్రేక్షకులకే కాకుండా స్టార్ హీరోలకు సైతం ఫేవరెట్ హీరోయిన్గా మారింది ఈమె. కానీ శైలిలో మాత్రం అందరూ హీరోయిన్ల లాగా కాకుండా కేవలం సీనియర్ హీరోల సరసన నటించేందుకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని తెలుస్తోంది. సీనియర్ హీరోల సరసన పెద్ద సినిమాలకు మాత్రమే ఒప్పుకుంటుంది. నందమూరి బాలకృష్ణ మరియు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఎన్.బి.కె 108 ప్రాజెక్టులో శ్రీ లీల నటిస్తోంది. దాన్ని అనంతరం సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ఎస్ఎస్ఎంబి 28 సినిమాలో సైతం హీరోయిన్ గా నటించే అవకాశాన్ని కొట్టేసింది ఈమె. ఈ సినిమాలే కాకుండా చాలా సినిమాలను లైన్లో పెట్టింది ఈమె. ఈ సినిమా అనంతరం రామ్ మరియు బోయపాటి కాంబినేషన్లో
రానున్న పాన్ ఇండియా సినిమాలో సైతం నటిస్తోంది ఈమె. అనంతరం వైష్ణవ తేదీ నటిస్తున్న నాలుగవ ప్రాజెక్ట్ లో కూడా ఈమె నటిస్తోంది. నితిన్ సినిమాలో కూడా హీరోయిన్గా నటించే అవకాశాన్ని కొట్టేసింది. ప్రస్తుతం సీనియర్ హీరోలు మరియు ట్రెండింగ్ లో ఉన్న స్టార్ హీరోల సరసన హీరోయిన్గా నటించే అవకాశాన్ని కొట్టేసిన ఈమె వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ మరియు హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో పవన్ కళ్యాణ్ కి జోడిగా శ్రీలీలని హరిశంకర్ ఫిక్స్ చేయనున్నట్లుగా తెలుస్తోంది..!!