త్రివిక్రమ్ వల్లే పవన్ కళ్యాణ్ మూవీ నుంచి తప్పుకున్న స్టార్ రైటర్..!
కానీ ఇంతలోనే త్రివిక్రమ్ డైలాగ్స్ రాస్తున్నట్లుగా వార్త ఒకటి బయటకు వచ్చింది. ఫలితంగా సాయి మాధవ్ బుర్రాను సినిమా నుంచి తప్పించారనే వార్త కూడా ఇప్పుడు నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. వినోదయ సీతం రీమేక్ కు సంబంధించి స్క్రిప్టులో ఎన్నో మార్పులు చేశారు త్రివిక్రమ్. పవన్ కళ్యాణ్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని ఈ మార్పులు చేసిన త్రివిక్రమ్ ఫైనల్ స్క్రిప్టును డైలాగు రైటింగ్ కోసం సాయి మాధవ్ కు అప్పగించడం జరిగింది. సాయి మాధవ్ అందించిన డైలాగ్స్ కు త్రివిక్రమ్ , సముద్రఖని ఇద్దరూ సంతృప్తి చెందారు కానీ పవన్ పాత్ర సాయిధరమ్ తేజ కంటే తేలికగా ఉందని భావించిన త్రివిక్రమ్ చేయమని సాయి మాధవ్ ను కోరారట.
అయితే ఇప్పటికే ఒప్పుకున్న కమిట్మెంట్స్ కారణంగా త్రివిక్రమ్ రిక్వెస్ట్ ను తిరస్కరించిన సాయి మాధవ్ ఈ సినిమా నుంచి తప్పకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఒక రకంగా చెప్పాలి అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ వల్లే సాయి మాధవ్ ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు అంటూ అభిమానులు తెగ గందరగోళం సృష్టిస్తున్నారు. ఇకపోతే త్రివిక్రమ్ ఇలా చేయడంతో బండ్ల గణేష్ ఏ విధంగా స్పందిస్తాడు అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.