టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా వెలుగుతున్న శృతిహాసన్ మరియు శాంతను ప్రేమ వ్యవహారం గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు అనడంలో ఇలాంటి సందేహం లేదు .వారి ప్రేమ బంధం గురించి అందరికీ తెలిసే ఉంటుంది. వీరిద్దరూ ఇప్పటికే రిలేషన్షిప్ లో ఉన్నారు. ముంబై లో ఒక లగ్జరీ భవనంలో వీరిద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారు. గత మూడేళ్లుగా వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారన్న సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది.మొదట వీరిద్దరూ కరోనా సమయంలో కలిశారు. వీరిద్దరూ ఒకేసారి కరోనా బారిన పడ్డారు. ఇక ఆ సమయం నుండి వీరిద్దరూ ఒకరికొకరు కలిసి తోడుగా ఉంటున్నారు.
ప్రేమ వ్యవహారం బయట పెట్టినప్పటికీ శృతిహాసన్ తమ పెళ్లికి సంబంధించిన మ్యాటర్ ని మాత్రం ఇప్పటివరకు చెప్పలేదు. గత కొంతకాలం క్రితం శృతిహాసన్ మరియు శంతను పెళ్లి మీద కోలీవుడ్ రూమర్లు క్రియేట్ చేసింది. ఇక ఆ విషయాన్ని తెలుసుకున్న శృతిహాసన్ గట్టి కౌంటర్ నే వేసింది. పెళ్లి చేసుకునే ఉద్దేశమే ఇప్పట్లో లేదని దానికి ఇంకా చాలా సమయం ఉందా అని అప్పటివరకు ఇలాంటి రూమర్లు చేయడం ఆపేయండి అంటూ చెప్పుకొచ్చింది శృతిహాసన్. అయితే ప్రస్తుతం ఈమె సలార్ సినిమా షూటింగ్ పనిలో ఉంది. ఇటీవల సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ముంబైకి కూడా తిరిగి వెళ్ళిపోయింది.
మళ్లీ శాంతను శృతిహాసన్ ఓకే ఇంట్లో కలిసి ఉండడంతో శృతిహాసన్ ఫుల్ హ్యాపీగా ఉందని తెలుస్తుంది.అయితే తాజాగా నిన్న వీకెండ్ స్పెషల్ గా డిన్నర్ కోసం బయటకు వెళ్లారు ఈ జంట.. ఈ క్రమంలోనే శృతిహాసన్ అలవాట్లు ఇష్టాల గురించి కూడా బయటపెట్టింది ..బయటకు వెళ్లి ఫుడ్ తినడమంటే నాకు శాంతనుకి చాలా ఇష్టమని ..తినడం కోసమే నేను శాంతను బతుకుతున్నామని ..తినేటప్పుడు ఎన్నో విషయాల గురించి మేమిద్దరం చర్చించుకుంటామంటూ చెప్పుకొచ్చింది.. నాలా భోజనాన్ని ఇష్టపడే ప్రియుడ్నే నేను ఇష్టపడ్డాను అంటూ చెప్పుకొచ్చింది. చచ్చేంత వరకు నేను శాంతనతో కలిసి ఉండడం చాలా లక్కీ అంటూ చెప్పుకొచ్చింది శృతిహాసన్..!!