SSMB 28 కొత్త షెడ్యూల్ షురూ..!
ఇకపోతే అప్పటినుంచి ఆయన తన తదుపరి చిత్రాన్ని ప్రకటించలేదు. ఆ తర్వాత కొంతకాలానికి మాటల మాంత్రికుడు త్రివిక్రంతో SSMB28 వర్కింగ్ టైటిల్ తో తన తదుపరి చిత్రం ఉంటుందని స్పష్టం చేశాడు. ఈ క్రమంలోనే మొదటి షెడ్యూల్ కూడా పూర్తయింది మొన్నటి వరకు రెండవ షెడ్యూల్ ని కూడా పూర్తి చేశారు. తాజాగా ఇప్పుడు కొత్త షెడ్యూల్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇందులో పూజా హెగ్డే, శ్రీ లీలా తో పాటు భూమి పడ్నేకర్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక అంతేకాదు ఈ సినిమాలో ఐటెం సాంగ్ కూడా ఉండబోతుందని త్రివిక్రమ్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కాజల్ అగర్వాల్ లేదా శృతిహాసన్ పేర్లు ఇప్పుడు పరిశీలనలో ఉన్న నేపథ్యంలో ఇద్దరిలో ఎవరో ఒకరు ఇందులో ఐటెం సాంగ్ లో నర్తించే అవకాశం ఉంది.
ఇకపోతే ఈ రోజు నుంచి ఈ సినిమా షెడ్యూలు ప్రారంభం కానున్న నేపథ్యంలో..పూజా హెగ్డే, శ్రీ లీల మరియు చాలా మంది తారాగణం ఈ సుదీర్ఘ షెడ్యూల్లో భాగం కానున్నారు. ఇక ఈ సినిమా ను ఆగస్ట్ 11, 2023న విడుదల చేయాలని టీమ్ ఆలోచిస్తుంది. మొత్తానికి అయితే ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత మహేష్ బాబు రాజమౌళి డైరెక్షన్లో చేయబోతున్నారు.