బాలయ్య ఆ బాధ నుంచి కోలుకోలేకపోతున్నారా..?

Divya
ఇటీవల కాలంలో నందమూరి ఫ్యామిలీలో ఎప్పటికప్పుడు అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటూ అటు కుటుంబ సభ్యులను ఇటు నందమూరి అభిమానులను మరింత భాగోద్వేగానికి గురి చేస్తున్నాయి.  ఈ క్రమంలోనే ఊహించని విధంగా నందమూరి మోహన కృష్ణ గారి అబ్బాయి నందమూరి తారకరత్న గుండెపోటుతో మరణించడం అత్యంత విషాదకరమైన సంఘటన జనవరి 27వ తేదీన తారకరత్నకు గుండెపోటు రాగా నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న ఈయనకు గుండెపోటు రావడంతో వెంటనే ఆయనను కేఈసీ హాస్పిటల్ కి  అక్కడ ఉన్న సిబ్బంది తరలించారు.  కానీ అప్పటికే ఆయన  కోమాలోకి వెళ్లిపోవడంతో మెరుగైన చికిత్స కోసం బెంగుళూర్ లో వున్న నారాయణ హృదయాలయ హాస్పిటల్ కు తరలించడం జరిగింది.
అక్కడ వైద్యులు ఎంత మెరుగైన చికిత్స అందించినప్పటికీ కూడా తారకరత్న బ్రతకలేదు.  అలా ఫిబ్రవరి 18వ తేదీన మహాశివరాత్రి రోజు ఆయన స్వర్గస్తులయ్యారు. తారకరత్న ట్రీట్మెంట్ కోసం బాలయ్య షూటింగ్లను కూడా ఆపుకొని రాత్రింబవళ్లు నిద్ర లేకుండా తారకరత్న ఆరోగ్యం కోసం ఎంతో శ్రమించారు.  షూటింగ్ లకు  కూడా ఆబ్సెంట్ అయ్యాడు. నిర్మాతలు బాలయ్య కు ఫోన్ చేస్తే మిగిలిన స్టాప్ తో షూటింగ్ చేసుకోమని దయచేసి నన్ను డిస్టర్బ్ చేయవద్దు అంటూ చాలా సున్నితంగా వారిని మందలించారు చిన్న కర్మ కూడా పూర్తయింది పెద్దకర్మకు కూడా డేట్ ఫిక్స్ చేశారు..
ఇప్పటికీ కూడా ఆయన తారకరత్న మరణం నుంచి కోలుకోలేకపోతున్నారు బాలయ్యను షూటింగ్ కు రమ్మని అడగడానికి కూడా నిర్మాతలకు ధైర్యం రావడం లేదు .. అయితే విషయం తెలుసుకున్న బాలయ్య మాత్రం మార్చి 4వ తేదీ నుంచి షూటింగ్ ఒక హాజరవుతానని చెప్పారట అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య తన 108వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.  ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా,  శ్రీ లీలా ఆయన కూతురుగా నటిస్తోంది. ఏది ఏమైనా తన బాధను ఇంకా మరిచిపోలేకపోయినప్పటికీ నిర్మాతలకు ఇబ్బంది కలక్కుండా ఆయన ఇలా షూటింగ్కు వస్తానని చెప్పినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: