ఆ సంతోషాన్ని తట్టుకోలేకపోయాము.. రోజా రమణి..!

Divya
తెలుగు , మలయాళం ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకొని హీరోయిన్గా.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పలు పాత్రలు పోషించి మంచి పేరు సంపాదించుకున్న రోజా రమణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 1967 లో వచ్చిన భక్త ప్రహ్లాద సినిమాలో ప్రహ్లాద పాత్రలో నటించి ఇండస్ట్రీకి పరిచయమైన రోజా రమణి..  చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన మొదటి సినిమాతోనే నేషనల్ అవార్డును అందుకుంది.
ఆ తర్వాత కొంతకాలానికి హీరోయిన్గా మెరిసిన ఈమె తెలుగు , మలయాళం ఇండస్ట్రీలలో బాగా పేరు తెచ్చుకొని .. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరం అయింది.  కొంతకాలానికి తన కొడుకు తరుణ్ ని కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా అంజలి సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేసింది. ఈ సినిమా తర్వాత హీరోగా మారి నువ్వే కావాలి , ప్రియమైన నీకు,  నువ్వే నువ్వే, నువ్వు లేక నేను లేను వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న తరుణ్ ఆ తర్వాత కాలంలో ఇండస్ట్రీలో రాణించలేక త్వరగా  ఫేడ్ అవుట్ అయ్యారు.
ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రోజా రమణి మాట్లాడుతూ.. అంజలి  సినిమా విడుదలయ్యి మంచి విజయం సాధించడంతో చాలా సంతోషంగా ఫీల్ అయ్యాము. ఒకసారి టీవీ చూస్తున్న సమయంలో నేషనల్ అవార్డ్స్ ప్రకటన వచ్చినప్పుడు..  అంజలి సినిమాలో నటించిన ముగ్గురికి నేషనల్ అవార్డ్స్ అంటూ మొదటి పేరు తరుణ్ ది చెప్పగా..  మా సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.. అయితే అది రిపీట్ చేసి వినే సదుపాయం అప్పట్లో లేదు.. కాబట్టి నిజమా కాదా అనేది అర్థం కాక వెంటనే మణిరత్నం గారి కో డైరెక్టర్ పాణి గారికి ఫోన్ చేసి అడిగాము..  ఆయన హ్యాపీనే కదా అని అన్నారు.. ఆ క్షణం నేను , మా ఆయన ఇద్దరం ఎమోషనల్ అయ్యాము అంటూ ఆమె తన సంతోషాన్ని వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: