బుచ్చిబాబు సినిమాలో.. రామ్ చరణ్ కు హీరోయిన్ పిక్స్?

praveen
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన  త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో హిట్ అందుకున్నాడు టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. అయితే ఇక ఈ సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు అని చెప్పాలి. ఇక ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. ఇక ఇప్పటికే వైవిద్యమైన దర్శకుడు శంకర్ తో ఆర్సి15 అనే వర్కింగ్ టైటిల్ తో ఒక సినిమాను చేస్తూ ఉన్నాడు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తూ ఉంది అని చెప్పాలి.

 అయితే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే కొత్త కథలను వింటూ ఇక కథ నచ్చితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం లాంటివి చేస్తూ ఉన్నాడు. ఈ క్రమంలోనే ఉప్పెన సినిమాతో సూపర్ హిట్ సాధించిన దర్శకుడు బుచ్చిబాబుతో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు రామ్ చరణ్. ఇక ఇందుకు సంబంధించి అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది అన్న విషయం తెలిసిందె. ఉప్పెన సినిమాతో డిఫరెంట్ లవ్ స్టోరీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బుచ్చిబాబు.. ఇక ఇప్పుడు చరణ్ తో మరింత డిఫరెంట్ లవ్ స్టోరీ ప్లాన్ చేస్తున్నాడు అన్నది తెలుస్తుంది.  శంకర్ సినిమా పూర్తయిన వెంటనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

 అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా ఎవరిని సెలెక్ట్ చేశారు అనేది మాత్రం ప్రస్తుతం హార్ట్ టాపిక్ గా మారిపోయింది. కాగా కొన్ని రోజుల నుంచి ఎంతోమంది హీరోయిన్ల పేరు తెరమీదకి వచ్చి వైరల్ గా మారిపోతున్నాయి అని చెప్పాలి. అయితే చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో రాబోయే సినిమాకు హీరోయిన్ ఫిక్స్ అయిందట. ఆ హీరోయిన్ ఎవరో కాదు గత ఏడాది సీతారామం సినిమాతో ప్రేక్షకుల మదిని దోచుకున్న మృనాల్ ఠాగూర్ అనేది తెలుస్తుంది. ప్రస్తుతం నానితో కలిసి ఒక సినిమా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇక అంతలోనే రామ్ చరణ్ సినిమాలో చాన్స్ కొట్టేసింది అనేది తెలుస్తుంది. ఇక దీనిపై అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: