పవర్ స్టార్ వీరాభిమానిగా మెగాస్టార్.. ఫ్యాన్స్ ఊరుకుంటారా..?

Divya
మెగాస్టార్ చిరంజీవి ఇటీవల బాబి డైరెక్షన్లో తెరకెక్కించిన చిత్రం వాల్తేరు వీరయ్య.. సంక్రాంతి సినిమాగా విడుదలై రూ.140 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి అప్పటివరకు ఉన్న రికార్డులను కూడా బ్రేక్ చేసింది. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా చిరంజీవి నుంచి ఈ రేంజ్ లో కలెక్షన్స్ అభిమానులు కూడా ఊహించి ఉండరు.. కానీ ఆయన తన స్టామినాను మరొకసారి నిరూపించారు. ఈ సినిమా తర్వాత చిరంజీవి తమిళంలో అజిత్ హీరోగా నటించిన సూపర్ హిట్ చిత్రం వేదాలం రీమేకుగా భోళా శంకర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ కూడా దాదాపు పూర్తయింది.
సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు పర్వాలేదు అనిపించుకున్నాయి. ఇప్పుడు సినిమాపై మరింత హైప్ పెంచడానికి సినిమా నుంచి మరొక క్రేజీ అప్డేట్ విడుదల చేయడం జరిగింది.. అసలు విషయం ఏమిటంటే మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమానిలా కనిపించబోతున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి.  అంతేకాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఇండస్ట్రీ హిట్గా నిలిచిన ఖుషిలోని పాపులర్ నడుము సన్నివేశాన్ని కూడా ఇందులో రీ క్రియేట్ చేయబోతున్నట్లు సమాచారం.
చిరంజీవి లాంటి వ్యక్తి ఇలాంటివి చేస్తే అభిమానులు తట్టుకోగలరా అని సోషల్ మీడియాలో కూడా కామెంట్లు బాగా వైరల్ గా వినిపిస్తున్నాయి.. మెగాస్టార్ పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా చిరంజీవి నటించిన ఏమాత్రం కరెక్ట్ కాదు అని దయచేసి చిరంజీవి స్థాయిని తగ్గించే విధమైన సన్నివేశాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా దర్శకుడు మెహర్ రమేష్ ను అభిమానులు కోరుకుంటున్నారు.. ఇక్కడ మరొక విశేషమేమిటంటే చిరంజీవి ఫ్యాన్ గా పవన్ కళ్యాణ్ ఒక్క సినిమాలో కూడా కనిపించలేదు అలాంటిది చిరంజీవి ఎలా నటిస్తాడు అంటూ మెగా అభిమానులు ఫైర్ అవుతున్నారు.. మరి ఈ విషయంపై క్లారిటీ వచ్చేవరకు ఇలాంటి రూమర్స్ వస్తూనే ఉంటాయి చెప్పడంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: