జబర్దస్త్ కి కొత్త యాంకర్ గా శ్రీముఖి.. నిజమేనా.. !?

Anilkumar
ఈటీవీలో గత పది సంవత్సరాలుగా ప్రసారమాతను జబర్దస్త్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జబర్దస్త్ కార్యక్రమం స్టార్ట్ అయినప్పటినుండి ఇప్పటివరకు ఈ షో కి యాంకర్లుగా అనసూయ మరియు రష్మీ గౌతమ్ వ్యవహరించిన సంగతి మనందరికీ తెలిసిందే.ఇటీవల అనసూయ వెళ్ళిపోవడంతో ఆస్థానంలోకి సౌమ్య రావడం జరిగింది. ఈ కన్నడ బ్యూటీ సౌమ్య జబర్దస్త్ కార్యక్రమాన్ని ప్రస్తుతం ఎలా రన్ చేస్తుందో మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మళ్లీ త్వరలోనే ఈ షో కి కొత్త యాంకర్ ని తీసుకురావాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది.. అయితే తాజాగా అందించిన సమాచారం ప్రకారం ఒకవేళ అన్ని అనుకున్నట్లుగా జరిగితే..

మల్లెమాల టీం త్వరలోనే జబర్దస్త్ కి యాంకర్ గా శ్రీముఖిని తీసుకొస్తారు అన్న సమాచారం వినబడుతోంది. ప్రస్తుతం యాంకర్ శ్రీముఖి పలు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ బిజీ బిజీగా ఉంది .ఇక శ్రీముఖికి ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్టిలో పెట్టుకొని జబర్దస్త్ కి యాంకర్ గా వస్తే కచ్చితంగా జబర్దస్త్ రేటింగ్ మరింత పెరిగే అవకాశం ఉంది అన్న నేపథ్యంలోనే మల్లెమాల ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది.ఈ క్రమంలోనే యాంకర్ గారు జబర్దస్త్ కార్యక్రమానికి శ్రీముఖి వస్తే బాగుంటుంది అని శ్రీముఖికి ఆహ్వానాన్ని కూడా అందించారట మల్లెమాల టీం.

కానీ ఆ సమయంలో తాను వేరే కార్యక్రమాలతో బిజీగా ఉండడంతో నువ్వు చెప్పిందట.అనంతరం చాలా సమయం తర్వాత మళ్లీ శ్రీముఖికి ఆహ్వానాన్ని అందించారట మల్లెమాల టీం. గతంలో శ్రీముఖి మల్లెమాల వారితో చాలా కార్యక్రమాలు చేసింది గతంలో ఈటీవీ ప్లస్ లో వచ్చిన చాలా కార్యక్రమాలకి యాంకర్ గా వ్యవహరించింది శ్రీముఖి.ఈ క్రమంలోని యాంకర్ తో పాటుగా కమెడియన్స్ మరియు జడ్జిలను కూడా మార్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే శ్రీముఖి జబర్దస్త్ కి యాంకర్ గా వస్తుందా లేదా అన్నది తెలియాలంటే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: