శ్రీదేవి గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన మెగాస్టార్ చిరంజీవి..!?

Anilkumar
టాలీవుడ్ సినీ  ఇండస్ట్రీలో స్వయంకృషితో హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఈ స్థాయికి ఎదిగాడు. ఇక అలాంటి మెగాస్టార్ చిరంజీవి తన కెరియర్ లో ఎంతో మంది హీరోయిన్లతో నటించాడు. అంతేకాదు ఎంతోమంది గొప్ప నటీమణులతో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు మెగాస్టార్. ఇన్నేళ్లపాటు కొన్ని అద్భుతమైన సినిమాలలో నటించి తెలుగు తెరపై తనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఇక అసలు విషయం ఏంటంటే.. ఎంతోమంది స్టార్ హీరోయిన్లతో మెగాస్టార్ చిరంజీవి నటించినప్పటికీ అతిలోకసుందరి శ్రీదేవి అంటే మెగాస్టార్ చిరంజీవికి చాలా ఇష్టమట.

 ఆమె స్థానం ఆయన హృదయంలో ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటుంది. ఇక ఈ విషయాన్ని ఇటీవల మెగాస్టార్ చిరంజీవి స్వయంగా చెప్పాడు. అయితే తాజాగా నిజం విత్ స్మిత అనే టాక్ షోకు వచ్చాడు మెగాస్టార్ చిరంజీవి ఇక ఈ షోలో భాగంగా శ్రీదేవి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు.ఆయన మాట్లాడుతూ.. శ్రీదేవితో కలిసి పని చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది అని..తనతో ఎప్పుడు పనిచేసిన చాలా ప్రత్యేకంగా ఉంటుంది అని.. అంతేకాదు శ్రీదేవి తన వర్క్ ఎక్స్పీరియన్స్ ను బాగా ఆస్వాదిస్తుందని.. చిరంజీవి ఎంతోమంది స్టార్ హీరోయిన్లతో సినిమా చేసినప్పటికీ శ్రీదేవితో మాత్రం  సినిమాలో పోటీపడి నటిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు మెగాస్టార్ చిరంజీవి.

ఇక మెగాస్టార్ మరియు శ్రీదేవి కలిసి జగదేకవీరుడు ,అతిలోకసుందరి, ఎస్పీ పరశురాం, మోసగాడు ఇలాంటి సినిమాల్లో నటించి మంచి జోడీగా కూడా పేరు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే తన ఫిమేల్ యాక్టర్ ఎవరో కూడా చెప్పాడు చిరంజీవి.. తనతో నటించిన హీరోయిన్ల అందరిలోనూ ఏదో ఒక ప్రత్యేక లక్షణాలు ఉంటాయని.. ఒక్కొక్కరిలో ఒక్కొక్క కొత్త లక్షణం నాకు నచ్చుతుంది అని చెప్పుకొచ్చాడు.. నేనేపద్యంలోని శ్రీదేవి గురించి మాట్లాడుతూ.. శ్రీదేవి డాన్స్ అంటే నాకు చాలా ఇష్టమని.. ఆమెతో సరదాగా చేసినంతగా మరెవరితోనో చేయలేదని చెప్పుకొచ్చాడు మెగాస్టార్ చిరంజీవి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: