తన ఆర్ సి 17 సినిమా కోసం ఆ కన్నడ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రామ్ చరణ్..!?

Anilkumar
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్  సినిమా బ్లాక్ బస్టర్ విజయం అనంతరం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ సినిమా అనంతరం ప్రస్తుతం ఏకంగా ఆరు సినిమాలని లైన్లో పెట్టాడు. తాజాగా హాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఈ విషయాన్ని స్వయంగా రామ్ చరణ్ వెల్లడించాడు. ఇక అందులో కన్నడ డైరెక్టర్ నార్తంతో కూడా ఒక సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది. నావీ బ్యాగ్రౌండ్ లో పవర్ఫుల్ యాక్షన్ గా ఈ సినిమా ఉండబోతుంది అని గత కొంతకాలంగా సోషల్ మీడియావేదికదా వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ పై ఏ డైరెక్టర్ కూడా టచ్ చేయని విధంగా ఈ దర్శకుడు ఈ కథను సిద్ధం చేయబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.అంతేకాదు ఈ సినిమాలోని మెయిన్ పాయింట్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి నచ్చడంతో ఈ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా కూడా సమాచారం. అయితే రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న ఈ సినిమాను అధికారికంగా ప్రకటించే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు ఈ నేపథ్యంలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తన 17వ సినిమా ఇదే అని కూడా చాలామంది అంటున్నారు.ఇదిలా ఉంటే ఇక 2017లో వచ్చిన కన్నడ సినిమా మఫ్టీ తో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు నార్తన్.

ఇక గ్యాంగ్ స్టార్ డ్రామాగా రూపొందిన  ఈ సినిమా కన్నడలో భారీ వసూళ్లను సాధించింది.ఇదిలా ఉంటే ఇక ప్రస్తుతం  rc 15 సినిమాకి సంబంధించిన షూటింగ్లో బిజీగా ఉన్నాడు.పాన్ ఇండియా లెవెల్ లో  రూపొందుతున్న ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి జోడిగా  కీయార అద్వానీ జంటగా నటిస్తోంది. ఈ సినిమా అనంతరం ఉప్పెన బుచ్చిబాబుతో కూడా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక సినిమా చేయనున్నాడు .ఇక ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రానుంది .ఇక ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 17 వ సినిమాకి సంబంధించిన ఈ వార్త కాస్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది.!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: