త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ వైడ్ గా పాపులారిటీని దక్కించుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్.ఈ సినిమా విజయం అనంతరం ఇప్పటివరకు ఎన్టీఆర్ తన తదుపరి సినిమాకి సంబంధించిన అప్డేట్ను ఇంకా తమ అభిమానులతో పంచుకోకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఎన్టీఆర్ అభిమానులు.ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివతో ఒక సినిమా చేయబోతున్నాను అని గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన చేసి చాలాకాలం అవుతున్నప్పటికీ ఇప్పటివరకు దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా ప్రారంభించలేదు.
అయితే ఎట్టకేలకు ఇటీవల జరిగిన కళ్యాణ్ రామ్ అమిగోస్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో జూనియర్ ఎన్టీఆర్ ఈ విషయంపై స్పందించాడు. ఇందులో భాగంగానే ఆయన మాట్లాడుతూ.. ఈ నెలలోనే పూజా కార్యక్రమాలు జరిపి వచ్చే నెల నుండి ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ను ప్రారంభిస్తాము అంటూ అధికారికంగా ప్రకటించడంతో ఈయన అభిమానులు సంతృప్తి చెందారు. ఇక ఎప్పుడైతే జూనియర్ ఎన్టీఆర్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడో అప్పటినుండి ఈ సినిమాకి సంబంధించిన ఏవో ఒక విషయాలు సోషల్ మీడియా వేదికగా బయటికి వస్తున్నాయి.అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త బయటకు రావడంతో వైల్డ్ అవుతుంది.
ఇక అదేంటి అంటే ఈ సినిమాలో ప్రతి నాయకుడు పాత్ర కోసం తమిళ స్టార్ హీరో విక్రమ్ ని గత కొన్ని రోజులుగా చిత్ర బృందం సంప్రదిస్తున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు విలన్ పాత్ర చేయడానికి విక్రం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం. ఇక కోలీవుడ్లో విక్రమ్ కి ఎంతటి ఫాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కోలీవుడ్ లోనే కాకుండా తెలుగులో కూడా ఆయనకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఇక ఆయన సినిమాల్లో ఆయన నటన ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే తరహాలో ఎలాంటి పాత్రలో అయినా జీవించి నటిస్తూ ఉంటాడు. ఇక అలాంటి ఇద్దరు యాక్టర్లు కలిస్తే ఈ సినిమా ఊహించని స్థాయిలో ఉంటుంది అని అంటున్నారు. ప్రస్తుతం ఇవాళ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేవరకు ఈ విషయంలో నిజం ఉందా లేదా అన్నది తెలియదు..!!