రామ్ చరణ్ తో నటిస్తే ఆ హీరోయిన్ కి పెళ్లి అవ్వడం పక్కా.. ఇదిగో ప్రూఫ్..?

Anilkumar
మన టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి నటిస్తే ఆ హీరోయిన్ కి పెళ్లి జరగడం ఖాయమని కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో  వైరల్ అవుతున్నాయి. మరి అది నిజమేనా? కాదా? అనేది ఇప్పుడు మన సమీక్షలో తెలుసుకుందాం.. బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ఇటీవల రామ్ చరణ్ కి జోడిగా త్రిబుల్ ఆర్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో అలియా భట్ రామ్ చరణ్ కి భార్యగా కనిపించింది. అయితే ఈ సినిమా విడుదలైన సుమారు నెలరోజుల్లోనే ఆలియా పెళ్లి జరిగిపోయింది. తాను ఎన్నో సంవత్సరాలుగా ప్రేమిస్తున్న బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ను ఆమె పెళ్లి చేసుకుంది. ఇక పెళ్లి తర్వాత ఇటీవల వీరికి ఓ పాప కూడా జన్మించిన విషయం తెలిసిందే. 

ఇక మరోవైపు రామ్ చరణ్ తో కలిసి గతంలో 'వినయ విధేయ రామ' అనే సినిమాలో నటించింది బాలీవుడ్ బ్యూటీకి కియారా అద్వానీ. ఇప్పుడు మరోసారి శంకర్ దర్శకత్వంలో చరణ్ కి జోడిగా నటిస్తోంది. ఇక ఈ హీరోయిన్ కూడా నిన్న తన బాయ్ ఫ్రెండ్ బాలీవుడ్ హీరోయిన్ సిద్ధార్థ మల్హోత్రాను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. గత కొంతకాలంగా రిలేషన్ లో ఉన్న ఈ జంట తాజాగా జై సల్మేర్ లోని ఒక ప్యాలెస్ లో చాలా గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఎంతో వైరల్ గా మారుతున్నాయి. ఇక ఒక రకంగా చెప్పాలంటే అలియా భట్, కీయరా అద్వాని ఇద్దరు హీరోయిన్లు రామ్ చరణ్తో నటించడానికి వీళ్ళ పెళ్లిళ్లకి ఏమాత్రం సంబంధం లేదు.

అది యాదృచ్ఛికంగా జరిగింది. కానీ అభిమానులు మాత్రం రామ్ చరణ్ తో నటించగానే ఆ హీరోయిన్లకు పెళ్లి జరగడంతో.. పెళ్ళికాని హీరోయిన్లకు రామ్ చరణ్ లక్కీ హీరో అంటూ చెప్పుకుంటున్నారు. దీంతో రామ్ చరణ్ తో ఏ హీరోయిన్ నటించినా.. ఆ తర్వాత ఆమెకు పెళ్లి అవ్వడం కన్ఫామ్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. ఇక తాజాగా పెళ్లి చేసుకున్న కీయార అద్వానీ త్వరలోనే రామ్ చరణ్, శంకర్ సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నట్లు సమాచారం. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే 70 శాతానికి పైగా షూటింగ్ పూర్తి అయినట్లు తెలుస్తోంది.ఇక మిగతా షూటింగ్ని కూడా పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రారంభంలో సినిమాను విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: