NTR 30 నుంచి లేటెస్ట్ అప్డేట్. ఫ్యాన్స్ కి పూనకాలే..!!
కానీ ఇప్పటివరకు సినిమా షూటింగ్ మాత్రం మొదలు కాలేదు... దాదాపు 8 నెలలకు పైగా సినిమా షూటింగ్ వాయిదా పడుతూనే వచ్చింది. మరొకవైపు ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా వచ్చిన ఎన్టీఆర్ కి ఇదే ప్రశ్న ఎదురయ్యింది దీంతో యాంకర్ సుమపై కూడా ఆయన సీరియస్ అయినట్టు మనం ఇదివరకే ఎన్నో ఫుటేజ్ వీడియోలను కూడా చూసాం .కానీ అభిమానులు మాత్రం ఎన్టీఆర్ నటిస్తున్న 30వ సినిమాకు సంబంధించి అప్డేట్ రావాలని తెగ ఆకాంక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే అభిమానులకు పూనకాలు తెప్పించే విధంగా ఎన్టీఆర్ 30వ సినిమాకు సంబంధించి చిన్న అప్డేట్ చేయడం జరిగింది.
ఇకపోతే ఎన్టీఆర్ 30వ సినిమా సెమీ పీరియడ్ సెట్ అప్ తో కల్పిత ద్వీపం మరియు ఓడరేపు బ్యాక్ డ్రాప్ ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఎక్కువగా హైదరాబాదు, వైజాగ్ ,గోవాలో షూటింగ్ జరుగుతుంది అని, ఈ చిత్రానికి భారీ వి ఎఫ్ ఎక్స్ వర్క్ కూడా డిమాండ్ చేయబడిందని సమాచారం. దీన్ని బట్టి చూస్తే ఈ సినిమా చిరంజీవి వాల్తేరు వీరయ్య రేంజ్ లో తెరకెక్కబోతోంది అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమా ఎన్టీఆర్ రేంజ్ ను నిలబెడుతుందో లేదో చూడాలి.