థమన్ కి నరకం చూపిస్తున్న మహేష్ ఫ్యాన్స్?

Purushottham Vinay
టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతను ఒక సినిమాకి అదిరిపోయే రేంజిలో మ్యూజిక్ ఇస్తే ఆ తరువాత తను చేయబోయే పది సినిమాలకు రొటీన్ రొట్ట కొట్టుడు కొడతాడు. పైగా థమన్ కి బిగ్గెస్ట్ కాపీ క్యాట్ మ్యూజిక్ డైరెక్టర్ అని కూడా పేరుంది. చాలా సార్లు కాపీ ట్యూన్స్ కొట్టి దొరికిపోయాడు థమన్.ఇక టాలీవుడ్ టాప్ హీరో సూపర్ స్టార్ మహేష్‌బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కొట్లాదిమంది అభిమానులు మహేష్ సొంతం. మహేష్ ఫ్యాన్స్ కూడా ఊర మాస్ ఫ్యాన్స్. తమ హీరో కోసం ఏం చెయ్యడానికైనా సిద్ధ పడతారు. తాజాగా థమన్‌ను టార్గెట్‌గా చేసి సోషల్ మీడియాలో అతన్ని ఫుట్ బాల్ ఆడుకుంటున్నారు మహేష్ ఫ్యాన్స్. దానికి కారణం కూడా లేకపోలేదు. మహేష్ బాబు ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కూడా తనకు ఒక సినిమా నచ్చిందంటే ఆ సినిమాని పొగుడుతూ ఇంకా ఆ సినిమాకి పని చేసిన వాళ్లందరిని ఆకాశానికి ఎత్తేసి ఎలాంటి ఈగో లేకుండా ట్వీట్ చేస్తాడు.కుదిరితే తన తరువాత సినిమాకి కూడా మహేష్ ఛాన్స్ ఇస్తారు.

సరిలేరు నీకెవ్వరూ, అల వైకుంఠపురంలో సినిమాలు ఒకేసారి విడుదల అయ్యి రెండు పెద్ద బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టాయి. నాన్ బాహుబలి రికార్డ్స్ నెలకొల్పయి. ఆ టైంలో థమన్ అలవైకుంఠపురంలో సినిమా సక్సెస్ మీట్ ఫంక్షన్ లో నోరు అదుపు తప్పి ఇండైరెక్టుగా సరిలేరు నీకెవ్వరూ సినిమాపై సెటైర్ వేశాడు. అయినా కానీ మహేష్ ఫ్యాన్స్ సహించారు. మహేష్ కూడా తన సర్కారు వారి పాట సినిమాకి థమన్ కి మ్యూజిక్ డైరెక్టర్ గా ఛాన్స్ ఇచ్చాడు. ఆ సినిమాలో కేవలం రెండు పాటలు తప్ప ఏవి ఆకట్టుకోలేదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సరిగ్గా ఇవ్వలేదు థమన్. ఆ విషయంలో మహేష్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. ఇక తాజాగా మహేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో తన 28 వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాని మహేష్ ఏమో కానీ మహేష్ ఫ్యాన్స్ మాత్రం చాలా సీరియస్ గా తీసుకున్నారు. అయితే తాజాగా థమన్ ఒక ట్యూన్ రెడీ చేసి త్రివిక్రమ్ కి మహేష్ కి వినిపించగా అది వాళ్లకి నచ్చలేదట. ఆ విషయం మహేష్ బాబు ఫ్యాన్స్ కి తెలిసి థమన్ ని ఓ రేంజిలో ట్రోల్ చేస్తూ ఫుట్ బాల్ ఆడుకుంటున్నారు. థమన్ ని సినిమా నుంచి తీసేయండి అని హ్యాష్ టాగ్ క్రియేట్ చేసి ట్విట్టర్ లో నేషనల్ లెవెల్ లో ట్రెండ్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: