విజయ్ దేవరకొండ... పరుశురామ్ కాంబినేషన్ మూవీని నిర్మించనున్న ఆ క్రేజీ నిర్మాత..?

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యంగ్ హీరో లలో ఒకరు అయినటు వంటి విజయ్ దేవరకొండ ఆఖరుగా బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన లైజర్ అనే పాన్ ఇండియా మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. అనన్య పాండే హీరోయిన్ గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయన్ని ఎదుర్కొంది. అలా లైగర్ మూవీ తో ప్రేక్షకులను తీవ్ర నిరుత్సాహపరిచిన ఈ యువ హీరో ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ శివ నార్వన దర్శకత్వంలో రూపొందుతున్న ఖుషి అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.

ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చాలా వరకు పూర్తి అయింది. ఇలా ఖుషి మూవీ సెట్స్ పై ఉండగానే విజయ్ తన తదుపరి మూవీ లకు సంబంధించిన పనులను కూడా పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా విజయ్ తన తదుపరి మూవీ ని పరుశురామ్ దర్శకత్వంలో చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించబోతున్నట్లు సమాచారం.

ఈ కాంబినేషన్ కు సంబంధించిన అప్డేట్ మరికొన్ని రోజుల్లోనే బయటకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఇది వరకే విజయ్ ... పరుశురామ్ కాంబినేషన్ లో గీత గోవిందం అనే మూవీ తెరకెక్కింది. కొంతకాలం క్రితం విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా అద్భుతమైన కలెక్షన్ లను రాబట్టింది. ఈ మూవీ లో రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ద్వారా విజయ్ కి రష్మిక కు టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: