అమిగోస్ ట్రైలర్: అల్లాడించిన కళ్యాణ్ రామ్?

Purushottham Vinay
ఇక నందమూరి కళ్యాణ్ రామ్ గతేడాది 'బింబిసార' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ మాత్రమే కొట్టకుండా ప్లాపుల్లో వున్న టాలీవుడ్ కి మళ్ళీ ఈ సినిమా హిట్ తో ఊపిరి పోశాడు. ఇక బింబిసార సినిమా హిట్ అవ్వడంతో కళ్యాణ్ రామ్ తరువాత సినిమాపై కూడా నందమూరి అభిమానుల అంచనాలు పెరిగాయి. ఇక నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న కళ్యాణ్ రామ్ 'అమిగోస్' మూవీ థియేట్రికల్ ట్రైలర్ రానే వచ్చేసింది వచ్చేసింది. కర్నూలులోని శ్రీరామ థియేటర్లో మూవీ టీం, ఫ్యాన్స్ ఇంకా అలాగే ప్రేక్షకుల మధ్య ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ అనేది గ్రాండ్‌గా జరిగింది.కళ్యాణ్ రామ్‌ని చూసేందుకు ఎయిర్ పోర్ట్ దగ్గరికి చాలా భారీగా అభిమానులు రావడంతో దాదాపు మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.ఇక 'అమిగోస్' సినిమాతో రాజేంద్ర రెడ్డి టాలీవుడ్ కి దర్శకుడిగా పరిచయమవుతుండగా.. కన్నడ హాట్ బ్యూటీ ఆషిక రంగనాథ్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది.ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ మూడు డిఫరెంట్ క్యారెక్టర్లలో కనిపించనున్నాడు. ఈమధ్య రిలీజ్ చేసిన టీజర్‌లో.. ఒకరికొకరు సంబంధం లేని, ఒకేలా ఉండే ముగ్గురు వ్యక్తుల జీవితాల్లో ఏం జరిగిందనేది కథ అంటూ సినిమాపై అంచనాలు పెంచేశారు యూనిట్. 


ఇక హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. కళ్యాణ్ రామ్ నిర్మించిన 'పటాస్' మూవీలో బాబాయ్ బాలయ్య 'రౌడీ ఇన్‌స్పెక్టర్' లోని 'అరే ఓ సాంబ' సాంగ్ ని రీమిక్స్ చేయగా దానికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు 'అమిగోస్' కోసం బాలకృష్ణ 'ధర్మక్షేత్రం' లోని ఎవర్ గ్రీన్ సాంగ్ 'ఎన్నోరాత్రులొస్తాయి గానీ' రీమిక్స్ సాంగ్ ని వదలగా అది కూడా ఎంతగానో ఆకట్టుకుంటోంది.ఇక ట్రైలర్ విషయానికొస్తే.. ఇందులో కళ్యాణ్ రామ్ మూడు విభిన్న పాత్రల్లో, సరికొత్త గెటప్స్‌లో అలరించాడు. బాడీ లాంగ్వేజ్, మేనరిజమ్స్ ఇంకా డైలాగ్ డెలివరీ విషయంలో చాలా ఫుల్ గా ఫోకస్ పెట్టాడు. విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా చాలా బాగున్నాయి. ఒక్కసారిగా సినిమా మీద అంచనాలను అమాంతం పెంచేసింది ట్రైలర్.. 'బింబిసార' సినిమాతో ఊహించని రీతిలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టిన కళ్యాణ్ రామ్ 'అమిగోస్' సినిమాతో కూడా మరో సూపర్ హిట్ అందుకోనున్నాడని.. ఈ సినిమా తన తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ 'జై లవ కుశ' లాగా కళ్యాణ్ రామ్ కెరీర్‌కి నటన పరంగా ఇంకా కమర్షియల్ గా ప్లస్ అవుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: