విజయ్ దేవరకొండ సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్.. మరి హీరో..?

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఒక ట్రెండు నడుస్తోంది.అది ఏంటి అంటే సూపర్ హిట్ సినిమాలకు సీక్వెల్స్ ను తెరకెక్కించడం. పాపులర్ పర్సనాలిటీస్ బయోపిక్ రూపొందించడం అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో ట్రెండ్ గా మారింది. అంతేకాదు వాటిపై ప్రేక్షక అభిమానుల్లో సైతం మంచి క్రీస్ ఏర్పడింది. అయితే ఇప్పటివరకు తెరకెక్కించిన బయోపిక్స్ మరియు సీక్వెల్స్ చాలావరకు మంచి సక్సెస్ను అందుకున్నాయి. మరికొన్ని సెట్స్ మీద మరియు చర్చల దశలను ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పుడు ఒక సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్ కోసం మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. 

ఇక అసలు విషయం ఏంటంటే అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ. అనంతరం గీతగోవిందం సినిమాతో మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. పరశురాం దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో జియో టు పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మించడం జరిగింది. ఆగస్టు 2018లో గీతగోవిందం సినిమా విడుదలై ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఈ సినిమాతో విజయ్ దేవరకొండ కి యూత్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ సైతం ఎక్కువయ్యారు. ఈ సినిమా విడుదలైన ఏడాది 100 కోట్లను కలెక్ట్ చేసింది.

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన లాక్ కెమిస్ట్రీ చాలా బాగా వర్క్ అవుట్ అయింది. అంతేకాదు ఈ సినిమాలోని పాటలు కూడా ఈ సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ బ్లాక్ బస్టర్ సినిమా గీతగోవిందం కి సీక్వెల్ చేసే ప్రయత్నాలు ప్రారంభించారట డైరెక్టర్. సేమ్ బ్యానర్ లో మరింత భారీ బడ్జెట్ తో ఊహించని మలుపులతో ఈ సినిమాని తెరకెక్కించే పనిలో పడ్డారని తెలుస్తోంది.ఈ నేపథ్యంలోనే హీరో హీరోయిన్లుగా విజయ్ మరియు రష్మిక మందననే ఉండబోతున్నారని తెలుస్తోంది.త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రానుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: