మెగాస్టార్ చిరంజీవి బాటలో కింగ్ నాగార్జున..!?

Anilkumar
ప్రస్తుతం ఉన్న సీనియర్ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. దాదాపు మెగాస్టార్ చిరంజీవి పదేళ్ల విరామం అనంతరం కత్తి రీమేక్ ఆధారంగా వచ్చిన ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. సెకండ్ ఇన్నింగ్స్ కి ఈ సినిమాతో శ్రీకారం చుట్టారు మెగాస్టార్ చిరంజీవి. పదేళ్ల గ్యాప్ తీసుకున్నప్పటికీ చిరంజీవి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తన క్రేజ్ కి తగ్గట్టుగానే ఆ సినిమా భారీవసురులని రాబట్టింది. దాని అనంతరం సైర నరసింహారెడ్డి సినిమాలో చాలావరకు ఇతర భాషల స్టార్స్ నటించడం జరిగింది. ఆ సినిమాలో కీలక అతిథి పాత్రలో అమితాబచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి 

ఇలా చాలామంది కనిపించిన సంగతి మనందరికీ తెలిసిందే. అనంత కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య సినిమాలో మెగాస్టార్ కొడుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక కీలక అతిథి పాత్రలో కనిపించడం జరిగింది. ఇక ఈ సినిమా అనంతరం మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలక అతిథి పాత్రలో కనిపించాడు. తాజాగా బాబి దర్శకత్వంలో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో కనిపించి ఈ సినిమాకి మరింత బలాన్ని చేకూర్చాడు. ఈ సినిమాలో ఇద్దరి క్యారెక్టర్లు బలంగా ఉండడంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.ఇప్పటికే ఏ సినిమా 200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.

ఈ నేపథ్యంలోనే మరో సీనియర్ హీరో అక్కినేని నాగార్జున కూడా ఇదే తరహాలో చిరంజీవిని ఫాలో అవుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకుముందు నాగార్జున నటించిన సినిమాలు పెద్దగా హిట్ కాకపోవడంతో చిరుని ఫాలో అవ్వాలని భావిస్తున్నాడట నాగార్జున. ఈ తరహాలోని తన చేయబోయే సినిమాల్లో మరో హీరోని కలుపుకొని నటించాలని అనుకుంటున్నాడట. ఈ నేపథ్యంలోనే గాడ్ ఫాదర్ ఫెమ్ మోహన్ రాజా దర్శకత్వంలో చేయనున్న అతని 100గా సినిమాని మల్టీ స్టారర్గ చేయడానికి సిద్ధంగా ఉన్నాడట. ఇక ఈ సినిమాలో అఖిల్ కీలక అతిథి పాత్రలో నటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెల్లడించనున్నారుట. ఈ సినిమా అనంతరం ధమాకా రైటర్ ప్రసన్నకుమార్ బెజవాడని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ సినిమాని తెరకెక్కించే ప్లాన్లో ఉన్నట్లుగా తెలుస్తోంది ..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: