రికార్డులను బ్రేక్ చేస్తూ సరికొత్త రికార్డు క్రియేట్ చేస్తున్న షారుక్ పఠాన్..!!

Divya
సిద్దార్థ్ ఆనంద్ డైరెక్షన్లో బాలీవుడ్ బడా హీరో షారుక్ ఖాన్ హీరోగా.. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే కాంబినేషన్లో వచ్చిన చిత్రం పఠాన్. ఈ సినిమా రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25వ తేదీన థియేటర్లలో చాలా గ్రాండ్గా రిలీజ్ అయ్యి భారీ వసూలు క్రియేట్ చేస్తోంది. ఎంతలా అంటే ఇప్పటికే ఈ సినిమా ఆర్ ఆర్ ఆర్, కే జి ఎఫ్2, బాహుబలి 2 రికార్డులను కూడా బ్రేక్ చేస్తూ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రం ముఖ్యంగా అదిరిపోయే వసూల్లను రాబడుతూ సరికొత్త సంచలనాలకు దారితీస్తోంది.
కేవలం ఐదు రోజుల్లోనే రూ. 542 కోట్లను వసూలు చేసిన ఈ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను మెప్పిస్తోందో చెప్పవచ్చు.  మళ్లీ బాలీవుడ్ పూర్వ వైభవాన్ని తీసుకురావడంలో ఈ సినిమా సక్సెస్ అయ్యింది. ఈ సినిమాతో బాలీవుడ్ మళ్లీ తన గత వైభవాన్ని పొందబోతోంది అని అక్కడ దర్శక నిర్మాతలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా కేజీఎఫ్ 2, బాహుబలి 2 రికార్డులను అధిగమించి అత్యంత వేగంగా 200 కోట్ల మార్కును అందుకున్న సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది కేవలం 4 రోజుల్లోనే రూ.429 కోట్లు రాబట్టింది ఈ చిత్రం.

జాన్ అబ్రహం ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించారు. ఇదిలా ఉండగా ఈ సినిమా భారీ సక్సెస్ అందుకొని దూసుకుపోతున్న నేపథ్యంలో పార్ట్ 2 కోసం అభిమానులు ఎదురుచూస్తున్నామంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా అభిమానులు ఈ సినిమా సీక్వెల్ గురించి చర్చ జరుగుతుండగా ఇదే ప్రశ్నకు ఇప్పుడు చిత్ర బృందం సమాధానం తెలిపింది. డైరెక్టర్ సిద్దార్థ్ మాట్లాడుతూ .." షారుక్ తో  సినిమా చేయాలనే కళ నెరవేరింది . మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి" అంటూ స్పష్టం చేశారు. మరి పఠాన్ సీక్వెల్ వస్తుందా లేదా అనేది మాత్రం సందేహంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: