ధమాకా డైరెక్టర్ తో మెగాస్టార్ సినిమా?

Purushottham Vinay
టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి ఇటీవల వాల్తేరు వీరయ్య సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు.మాస్ మహారాజ్ రవితేజ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాని యంగ్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించారు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా జనవరి 13వ తేదీన సంక్రాంతి సందర్భంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి మెహర్ రమేష్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేస్తున్నారు. భోళాశంకర్ అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి గతంలోనే యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక సినిమాని ప్రకటించారు. డివివి దానయ్య నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కబోతుందని అప్పట్లో ఆయన ప్రకటించారు. కానీ తర్వాత ఎందుకు చిరంజీవి ఈ సినిమాను పక్కన పెట్టినట్లో తెలీదు.అయితే ఇక ఇప్పుడు తాజాగా మరో కాంబినేషన్ తెర మీదకు వచ్చింది.


ఈమధ్యనే ధమాకా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న త్రినాధ రావు నక్కిన మెగాస్టార్ చిరంజీవికి ఒక కథ చెప్పారని ఆ కథ చిరంజీవికి బాగా నచ్చడంతో మెగాస్టార్ చిరంజీవి ఆ కథతో సినిమా చెయ్యాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. అయితే ఈ సినిమాని డివివి ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించే అవకాశం ఉందనే ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే వెంకీ కుడుముల కథని పక్కన పెట్టాక డివివి దానయ్య త్రినాధరావు నక్కిన సినిమా చేయబోతున్నారా లేక వెంకీ కుడుముల కథ ఉండగానే మరో సినిమా కూడా  దానయ్య ప్రకటిస్తున్నారా అనేది ఇప్పుడు బాగా చర్చనీయాంశం అయింది. ఇక ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే ఒక అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం కనిపిస్తోంది. మాస్ మహారాజా రవితేజ హీరోగా శ్రీ లీల హీరోయిన్ గా తెరకెక్కిన ధమాకా సినిమా డిసెంబర్ నెలలో విడుదలయి మంచి సూపర్ హిట్ అందుకొని ఏకంగా 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: