RC15 తదుపరి షెడ్యూల్ ఎప్పుడు? ఎక్కడంటే..?
గత ఏడాది రామ్ చరణ్ rrr సినిమాతో పాన్ ఇండియా హీరోగా కూడా పేరు పొందారు. రామ్ చరణ్ తన తదుపరి చిత్రాలను కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాంచరణ్ ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తన తదుపరి చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తున్నది. కీలకమైన పాత్రలో సునీల్ ,అంజలి తదితరులు నటిస్తూ ఉన్నారు. ఇక ఈ సినిమా తదుపరి షెడ్యూల్.. రెండు రోజులపాటు హైదరాబాదులో నిర్వహించిన తర్వాత.. ఫిబ్రవరి నెలలో మొదటి వారంలో రాజమండ్రిలో షూటింగ్ మొదలుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రాన్ని కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నారు ఈ సినిమా పైన కూడా మెగా అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చుస్తున్నారు. మరి ఈ సినిమాతో ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తాడు రామ్ చరణ్ చూడాల్సి ఉంది. ఇక రామ్ చరణ్ బర్త్ డే కూడా త్వరలోనే ఉండడంతో ఈ సినిమాకు సంబంధించి అప్డేట్ కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.