త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా మొదలుపెట్టనున్నారు. అయితే పవన్
కళ్యాణ్ సినిమా కంటే ముందే నందమూరి
బాలకృష్ణ తో ఒక
సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు హరీష్ శంకర్. తాజాగా నందమూరి
బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి
సంక్రాంతి కానుకగా విడుదలై ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో.. ఈ సినిమాని మైత్రి
మూవీ మేకర్ సంస్థ నిర్మించిన సంగతి మనందరికీ తెలిసిందే. తాజాగా
బాలయ్య నటించిన ఈ
సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో
సక్సెస్ మీట్ ను నిర్వహించారు చిత్ర బృందం.
ఇందులో భాగంగానే
సక్సెస్ మీట్ కి
డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా వచ్చాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే
బాలయ్య బాబుతో ఒక
సినిమా చేయడానికి రెడీగా ఉన్నాను. ఈ సినిమాకి సంబంధించిన ఓపెనింగ్ సీన్ ని నేనే డైరెక్ట్ చేశాను. ఆ ఒక్క సీన్ కే అంతా మంచి రెస్పాన్స్ వస్తే.. అదే ఆయనతో కలిసి
సినిమా చేస్తే ఏ రేంజ్ లో ఉంటుంది.. త్వరలోనే బాలయ్యను ఒప్పించి స్టోరీ సిద్ధం చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చాడు హరీష్ శంకర్. అంతేకాదు బాలయ్యతో ఎప్పటినుండో
సినిమా చేయాలని కోరుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇందులో భాగంగానే చాలామంది హీరోలకు మంచి విజయాన్ని నేను ఇవ్వడంతో వారి అభిమానులు నన్ను ఎంతో గౌరవిస్తారు. అందుకే మీతో కూడా ఒక
సినిమా చేసి మీ అభిమానుల ఆదరణ కూడా నేను పొందాలని భావిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు హరీష్ శంకర్..!!