విషమంగా మారిన విజయ్ ఆంటోనీ ఆరోగ్య పరిస్థితి..!

Divya
ప్రముఖ ప్లే బ్యాక్ సింగర్.. లిరిసిస్ట్.. మ్యూజిక్ కంపోజర్.. ఆడియో ఇంజనీర్.. హీరో ఇలా ఎన్నో పాత్రలు పోషిస్తూ ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసిన విజయ్ ఆంటోనీ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియదనే చెప్పాలి.. కానీ బిచ్చగాడు సినిమాతో భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈయన అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా మరింత దగ్గరయ్యాడు. దీంతో ఈయనకు సంబంధించిన ఏ చిన్న విషయం అయినా సరే ఇట్టే వైరల్ అవుతూ ఉంటుంది . ఇదిలా ఉండగా బిచ్చగాడు సినిమా సీక్వెల్ మలేషియాలో షూటింగ్ జరుగుతుండగా.. అక్కడ బోట్ ప్రమాదం జరిగి విజయ్ ఆంటోనీకి తీవ్రంగా గాయాలైనట్లు సమాచారం.
మలేషియాలో షూటింగ్ చేస్తున్నప్పుడు ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తోంది. విజయ్ ఆంటోనీ ఉన్న బోటు ఎదురుగా ఉన్న మరో బోటును ఢీకొట్టడంతో విజయ్ ఎగిరి కింద పడ్డారట.  దీంతో ముఖానికి గాయాలైనట్లు.. పళ్ళు,  దవడ ఎముకలు విరిగినట్లు విజయ్ భార్య ఫాతిమా వెల్లడించింది. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది అని వార్తలు వినిపిస్తున్నాయి.  అయితే నిన్న కూడా ఇలాంటి వార్తలు వచ్చినా ఆయన సన్నిహిత వర్గాలు మాత్రం అభిమానులను దృష్టిలో పెట్టుకొని అలాంటిదేమీ లేదు అంటూ చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం విజయ్ ఆంటోనీ ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉందని తెలుస్తోంది.
ఆయన ఇంకా చెన్నైకి తిరిగి రాలేదు అని.. అక్కడే మలేషియాలో చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. ముఖానికి బాగా గాయాలు తగలడంతో ఫేస్ సర్జరీ చేయాలి అని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. ఇకపోతే అక్కడే మలేషియాలో విజయ్ ఆంటోనీకి తోడుగా డాన్స్ మాస్టర్ కళ్యాణ్ అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది . ఈ విషయం తెలిసి అభిమానులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు త్వరగా రికవరీ అయి తిరిగి రావాలని కూడా కోరుకుంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: