జబర్దస్త్ పంచ్ ప్రసాద్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.అయితే ఈయన గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే కిడ్నీ సమస్య కోసం వైద్యం చేయించిన పూర్తి స్థాయిలో ప్రసాద్ ఇంకా కోలుకోలేదు. ఆ మధ్య నడవలేని పరిస్థితిలో ఉన్న ఈయన వీల్ చైర్ లో కూర్చుని కూడా కొన్ని టీవీ షోలకు రావడం జరిగింది. ఇక ఈ విషయాన్ని పంచ ప్రసాద్ తోటి కమెడియన్ నూకరాజు చెప్పాడు. ఇక కొన్ని వీడియోలను షేర్ చేస్తూ పంచ్ ప్రసాద్ అన్న త్వరగా కోలుకోవాలి అని చెప్పుకోవచ్చాడు నూకరాజు.
ఇక ఆయన స్నేహితులు ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆయనకి తోడుగా ఉన్నారు. కొంత డబ్బును సహాయం చేస్తూ తిరిగి షోలకు రావాలని ఆయన స్నేహితులు చాలా సపోర్టివ్ గా ఉన్నారు. అయితే తాజాగా పంచ్ ప్రసాద్ కండిషన్ గురించి స్పందించాడు కిరాక్ ఆర్. పి ఆర్ పి మాట్లాడుతూ.. పంచు ప్రసాద్ త్వరగా కోలుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను.. ఆయన్ని ఆదుకుంటానని నేను మాట ఇచ్చాను... పంచ్ ప్రసాద్ నా స్నేహితుడు.. చాలా మంచి వ్యక్తి... తన దగ్గర ప్రస్తుతం ఒక రూపాయి కూడా లేదు.. ఉన్న డబ్బుంతా వైద్యం కోసం ఖర్చు చేశాడు.. ప్రస్తుతం ఇంటి అద్దె కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉన్నాడు ప్రసాద్..
దీంతో ఇప్పుడు కొత్తగా అప్పులు కూడా చేస్తున్నాడు.. అందుకే ప్రసాద్ ని నేను ఆదుకుంటాను.... 15 లక్షలు ఖర్చయినా కూడా కిడ్నీ ఆపరేషన్ చేయిస్తాను.. మణికొండలో పెద్దారెడ్డి చేపల పులుసు కొత్త బ్రాండ్ ని ఓపెన్ చేయబోతున్నాను.. ఇక అందులో వచ్చే లాభాలతో పంచ్ ప్రసాద్ కి ప్రతి నెల డబ్బులు పంపే ప్రయత్నం చేస్తాను.. తన వైద్యానికి అయ్యే ఖర్చు కంటే ఎక్కువే పంపుతాను.. అంటూ పంచు ప్రసాద్ కి హామీ ఇచ్చాడు ఆర్పి... దీంతో ఈ వార్త విన్న చాలా మంది ఆర్పీని మెచ్చుకుంటున్నారు..!!