ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ మొట్టమొదటిసారిగా హోస్ట్గా వ్యవహరిస్తున్న అన్ స్టాప్బుల్ షో ఎంతటి ఆదరణను పొందిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇప్పటికే మొదటి సీజన్ అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో రెండవ సీజన్లో మరింత అద్భుతంగా ప్రారంభించారు ఆ హా టీం. ఇక ఎవరు ఊహించిన విధంగా మంచి రెస్పాన్స్ కూడా వస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ షో తో నందమూరి బాలకృష్ణ రేంజ్ మరింత పెరిగింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక నందమూరి బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరిస్తున్న ఈ షో మొదటి సీజన్ కంటే రెండవ సీజన్ కి బాలకృష్ణ ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది .
అయితే ఈసారి నందమూరి బాలకృష్ణ ఆహా నుండి ఏకంగా 10 కోట్లకు పైగా అని రెమ్యూనరేషన్ను తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇటీవల పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఈ షో కి రావడంతో ఈ షో రేంజ్ మరింత పెరిగిపోయింది అనడంలో ఇలాంటి సందేహం లేదు. గతంలో కంటే ఎక్కువ స్థాయిలో సబ్స్క్రైబర్లు పెరిగారు. అయితే ఇటీవల విడుదలైన ఎపిసోడ్లో ప్రభాస్ తో పాటు గోపీచంద్ కూడా వచ్చి బాలయ్య షోలో అందరినీ అలరించారు ఈ షోలో భాగంగా వారి కెరియర్ గురించి మాట్లాడుతూ చాలా ఎమోషనల్ కూడా అయ్యారు. దీంతో ఈ ఎపిసోడ్ కి భారీ స్థాయిలో క్రేజ్ రావడం జరిగింది.
అయితే ఎన్నడూ ఊహించిన విధంగా ఈ షో కి ఈసారి ఊహించని స్థాయిలో మంచి ఆదాయాలు వచ్చాయి. అయితే ముఖ్యంగా ఈ షో కి ప్రభాస్ మరియు గోపీచంద్ రావడం ఇక ఆ ఎపిసోడ్ ని రెండు భాగాలుగా విడుదల చేయడం తో ఈ షో కి మంచి ఆదరణ లభించిందిమ్మరీ ముఖ్యంగా తొమ్మిది ప్రైవేట్ కంపెనీలలో బ్రాండ్స్ ఎపిసోడ్ కు స్పాన్సర్ చేసినట్లుగా తెలుస్తోంది.అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆహా కి దాదాపు 15 నుండి 20 కోట్ల వరకు ఆదాయం ప్రభాస్ ఎపిసోడ్ ద్వారా వచ్చినట్లుగా తెలుస్తోంది.ఇక ప్రభాస్ వచ్చిన ఎపిసోడ్ తోనే ఈ స్థాయి ఆదాయం వచ్చిందంటే సంక్రాంతి తర్వాత పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కి ఏ స్థాయిలో ఆదాయం వస్తుందో అని అందరూ ఆశ్చర్యపోతున్నారు ..!!