దిల్ రాజ్ సహకారంతో అదృష్టాన్ని పొందిన బాలకృష్ణ !

Seetha Sailaja
ఎవరూ ఊహించని విధంగా ‘వారసుడు’ మూవీ జనవరి 14కు వాయిదా పడటంతో ‘వీరసింహా రెడ్డి’ మూవీకి అత్యంత భారీ స్థాయిలో తెలుగు రాష్ట్రాలలో ధియేటర్లు దొరుకుతున్నాయి. ‘వాల్తేర్ వీరయ్య’ మూవీ విడుదల 13వ తారీఖు కావడంతో 12వ తారీఖున విడుదలకాబోతున్న ‘వీరసింహా రెడ్డి’ మూవీ ఓపెనింగ్ కలక్షన్స్ కోసం ఆకాశమే హద్దుగా మారింది.

 

 ఇప్పటివరకు ధియేటర్లు దొరకక తెగ ఇబ్బందిపడ్డ ‘వీరసింహా రెడ్డి’ ఆమూవీ టాక్ తో సంబంధం లేకుండా మొదటిరోజు 20 నుంచి 25 కోట్ల కలక్షన్స్ రాబట్టినా ఆశ్చర్యంలేదు అంటున్నారు. బాలయ్య అభిమానులు ఆశిస్తున్నట్లుగా ఈమూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకోగలిగితే సంక్రాంతి పండుగ ముగిసే సరికి ఈమూవీ అతి సులువుగా 100 కోట్ల క్లబ్ లో చేరుకునే అవకాశం ఉంది అన్నఅంచనాలు కూడ వస్తున్నాయి.

 

 
అయితే ఇలా జరగాలి అంటే ఈ సంవత్సరం సంక్రాంతి రేస్ లో మొదటిగా విడుదల అవుతున్న ‘వీరసింహా రెడ్డి’ అన్ని వర్గాల ప్రజలకు నచ్చవలసిన అవసరం ఉంది. మరొకవైపు కేవలం ఒక్కరోజు గ్యాప్ తో ‘వాల్తేర్ వీరయ్య’ వస్తున్న నేపధ్యంలో బాలయ్య సినిమా చిరంజీవి మ్యానియాను తట్టుకుని నిలబడాలి అంటే ‘వీరసింహా రెడ్డి’ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చితీరాలి. ఇప్పటివరకు విడుదలైన ఈమూవీ టీజర్ అదేవిధంగా ట్రైలర్ ను నిశితంగా పరిశీలిస్తే ఈమూవీలో కథ కంటే బాలకృష్ణ ఊచకోత ఎక్కువగా ఉంటుంది అన్న సంకేతాలు వస్తున్నాయి.

 

బాలకృష్ణ సినిమా టిక్కెట్ల కోసం చిన్నతనంలో గోపీచంద్ మలినేని దెబ్బలు తింటే చిరంజీవి సినిమా మొదటిరోజు టిక్కెట్ల కోసం దర్శకుడు బాబి కూడ తాను తన చిన్నతనంలో దెబ్బలు తిన్నాను అని అంటున్నాడు. ఇలా బాలకృష్ణను అదేవిధంగా చిరంజీవిని తమ చిన్నతనం నుండి అభిమానిస్తూ వచ్చిన గోపీచంద్ మలినేని దర్శకుడు బాబి లు సీనియర్ హీరోలకు భారీ హిట్ ఇవ్వాలి అన్న ఉద్దేశ్యంతో ఈ ఇద్దరి దర్శకులు విపరీతంగా కష్టపడ్డారు. దీనితో ఈ దర్శకుల వార్ లో కూడ ఏదర్శకుడు విజేతగా మారుతాడు అన్న ఆశక్తి అందరిలోనూ ఉంది..

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: