వారసుడు సినిమా ఆ తేదీకి వాయిదా..?

Pulgam Srinivas
తమిళ సినిమా ఇండస్ట్రీలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటువంటి దళపతి విజయ్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దళపతి విజయ్ పోయిన సంవత్సరం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన బీస్ట్ అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించాడు. మంచి అంచనాలు నడుమ తమిళ్ , తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో భారీ ఎత్తున విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ మూవీ గా నిలిచింది.

ఇది ఇలా ఉంటే తాజాగా కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి ఈ హీరో వారిసు అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ కి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించగా ... వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు. రష్మిక మందన హీరోయిన్ గా నటించిన ఈ మూవీ లో శ్రీకాంత్ ఒక కీలకమైన పాత్రలో కనిపించనుండగా ... తమన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని తెలుగు లో వారసుడు పేరుతో విడుదల చేయనున్నారు.

కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ తమిళ్ మరియు తెలుగు వర్షన్ లను ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 11 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే గత కొన్ని రోజులుగా ఈ మూవీ తమిళ వెర్షన్ జనవరి 11 వ తేదీన విడుదల కానుండగా ... తెలుగు వర్షన్ మాత్రం కాస్త లేటుగా విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ తమిళ వర్షన్ జనవరి 11 వ తేదీన విడుదల కానుండగా ... తెలుగు వర్షన్ జనవరి 14 వ తేదీన విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: