ఆ స్టార్ హీరోయిన్ వల్లే రామ్ గోపాల్ వర్మ ఇలా తయారయ్యాడా..!?

Anilkumar
10, 15 సంవత్సరాల క్రింది పాన్ ఇండియా లాంటి సినిమాలను తెరకెక్కించాడు రామ్ గోపాల్ వర్మ. ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించి మంచి దర్శకుడుగా పేరు కూడా తెచ్చుకున్నాడు.అయితే ఈ మధ్య కాలంలో మాత్రం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉన్నాడు. శృంగార భరిత సినిమాలు చేస్తూ మంచి డైరెక్టర్ గా ఉన్న పేరును పోగొట్టుకున్నాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే గతంలో శివ ,సర్కార్ వంటి పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కించాడు ఈయన. ఇదిలా ఉంటే ఇక అసలు విషయంలోకి వెళితే రాంగోపాల్ వర్మ కి మొదటి నుండే అతిలోకసుందరి శ్రీదేవి అంటే చాలా ఇష్టం.

చాలా సందర్భాల్లో ఇండస్ట్రీకి రావడానికి ముఖ్య కారణం శ్రీదేవి అని చెప్పాడు. అంతేకాదు చాలా సందర్భాల్లో శ్రీదేవిని నేను పెళ్లి చేసుకుంటాను మీకు భర్తగా ఉంటాను అంటూ రాంగోపాల్ వర్మ చెప్పినప్పటికీ చాలా సున్నితంగా నో  చెప్పిందట శ్రీదేవి. శ్రీదేవి నో చెప్పినప్పటికి వర్మ శ్రీదేవిని ప్రేమించడం ఆపలేదు. దాని అనంతరం బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ ని వివాహం చేసుకుంది శ్రీదేవి. ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న రాంగోపాల్ వర్మ అలాంటి అతిలోకసుందరినీ పెళ్లి చేసుకోవాలి అంటే పెట్టి పుట్టాలి అంటూ ఫీల్ అయ్యాడు. ఇక శ్రీదేవికి వివాహం జరిగిన అనంతరం చాలామంది హీరోయిన్ లని ప్రేమించాడు వర్మ.

ఈ నేపథ్యంలోనే ఆశు రెడ్డితో రాంగోపాల్ వర్మ చేసిన ఇంటర్వ్యూ ఎంతటి దుమారాన్ని రేపిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈ నేపథ్యంలోనే ఐటమ్ హీరోయిన్ గా పేరుపొందిన జయమాలిని ఓ ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. ఇక ఈ నేపథ్యంలోనే రాంగోపాల్ వర్మకి ఫోన్ చేసింది. రాంగోపాల్ వర్మ ఆ ఫోన్ కాల్ లో మాట్లాడుతూ...నేను మీ వల్లే చదువు పాడు చేసుకున్నాను అని చెప్పాడు. దీంతో ఒక్కసారిగా  షాక్ అయ్యింది జయమాలిని. ఎందుకు అని అడిగితే.. నాకు మీ డాన్స్ అంటే చాలా ఇష్టం ..ఏదైనా సినిమాలో మీ డాన్స్ వస్తే నాకు పిచ్చెక్కింది.. ఆ పిచ్చి తోనే చదువుకోవడం కూడా మానేసి మీ సినిమాలు చూస్తూ ఉండిపోయాను నేను ఇప్పుడు ఇలా ఉండడానికి కారణం మీరే అంటూ చెప్పుకొచ్చాడు వర్మ..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: