అందుకే చిరంజీవి మొఖం నేను చూడను..షాకింగ్ కామెంట్స్ చేసిన అలీ..!?

Anilkumar
కమెడియన్ గా తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు అలీ. అయితే ప్రస్తుతం అలీ సినిమాల్లోనే కాకుండా బుల్లితెరపై ప్రసారమవుతున్న టీవీ షో లలో జడ్జిగా మరియు హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే స్టార్ హీరోల సినిమాల ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా హోస్ట్గా వ్యవహరిస్తున్నాడు. స్టార్ హీరోలు సైతం కమెడియన్ అలీ తమ సినిమాలో నటిస్తే బాగుంటుంది అని అలీ డేట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారట. ఇక అంతటి క్రేజ్ సంపాదించుకున్న అలీ తాజాగా యూట్యూబ్లో ఒక ఛానల్ ని కూడా ప్రారంభించాడు.

 ఇక అందులో భాగంగా తమ కు సంబంధించిన విషయాలను వీడియోల ద్వారా షేర్ చేస్తూ ఉన్నారు. అయితే అలీ ప్రస్తుతం ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాలలో కూడా బిజీగా ఉన్నాడు. తాజాగా ఆలీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిజిటల్ ఎలక్ట్రానిక్ మీడియా పదవి లభించిన సంగతి మనందరికీ తెలిసిందేమ్ ఇక ఈ పదవీ కారణంగా గత కొంతకాలంగా బుల్లితెర కు విరామాన్ని ఇచ్చాడు. అయితే తాజాగా ఈ షోకి బదులుగా ఇప్పుడు సుమ కొత్త షో ని ప్రారంభించింది. అయితే ఈ షో కి సంబంధించి తాజాగా ఒక ప్రోమో కూడా రావడం జరిగింది.

 ఇక ఆ గ్రామంలో భాగంగా జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మరియు కమీడియన్ అలీ, పోసాని కృష్ణమురళి రావడం జరిగింది. సుమ అంటే ఎంటర్టైన్మెంట్ అని మనందరికీ తెలిసిందే.తన కామెడీ పంచులతో ఎంతోమందిని ఆకట్టుకుంది సుమ. ఇక ఈ ప్రోమోలో సుమ జానీ మాస్టర్ గురించి మాట్లాడుతూ జానీ మాస్టర్ కావాలనే అమ్మాయిలను గుద్దడానికి రోడ్డు మీదకి వెళతారు అంటూ జానీ మాస్టర్ మీద ఒక పంచ్ వేసింది. దాని అనంతరం ఆలీతో మాట్లాడుతూ.. చిరంజీవి గారిని కలిస్తే మీరు ఆయన మొహం ఎందుకు చూడరని అడిగింది.. దీనికి అలీ... చిరంజీవిని చూడగానే ఏదో ఒక రకమైన ఎక్స్ప్రెషన్ను నన్ను చూసి ఇస్తారు... నా మొహాన్ని ఆయన చూడలేక నవ్వుకుంటారని... అందుకే నేను చిరంజీవి గారిని చూడను అంటూ తెలియజేశాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: