పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.ప్రస్తుతం వరుస సినిమాలో చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు ప్రభాస్.ఇక సినీ ఇండస్ట్రీలో ఈశ్వర్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ దాని అనంతరం ఎన్నో ఫ్లాప్ సినిమాల్లో నటించాడు. చాలా సినిమాల తరువాత వర్షం సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమా రిలీజ్ చేయడానికి ప్రభాస్ చాలా భయపడ్డాడట.ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ చేసే సమయంలోనే మెగాస్టార్ చిరంజీవి మరియు బాలకృష్ణ నటించిన సినిమాలు సైతం రిలీజ్ అవుతున్నాయట. ఇక అంత పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అవ్వడంతో..
ఈ సినిమా రిలీజ్ అయి హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో అని భయపడ్డాడట ప్రభాస్. ఇక ఈ విషయాన్ని ప్రభాస్ తాజాగా బలయ్యే హోస్ట్ గా వ్యహరిస్తున్న అన్ స్టాపబుల్ షోలో చెప్పాడు. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న అనంతరం ఆయన నటించిన సినిమాలన్నీ హిట్ లు అందుకున్నాయి.ఇక అలా కొన్ని సినిమాలతో హిట్ లను అందుకున్నప్పటికీ మళ్లీ వరుస ప్లాపులను అందుకుంటూ వచ్చాడు ప్రభాస్.అయితే ఇన్ని సినిమాలలో నటించి కొన్ని సినిమాలు ప్లాప్ లను అందుకున్నప్పటికీ ప్రభాస్ ఏ మాత్రం బాధపడలేదు. అలా గతంలో వరుస ఫ్లాప్ లను అందుకున్న ప్రభాస్..
ప్రస్తుతం సౌత్ లోనే ఒక్కో సినిమాకి గాను ఏకంగా 150 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఏకైక హీరోగా గుర్తింపు పొందాడు. అయితే ఇలా ఎన్నో సినిమాలలో నటించిన ప్రభాస్ కథ నచ్చనప్పటికీ బిల్లా సినిమాలో నటించాడు. ప్రభాస్ కి ఈ సినిమా చేయడం ఏమాత్రం ఇష్టం లేదు. కానీ కృష్ణంరాజు మాత్రం ఈ సినిమా కథ విని ఓకే చేశాడు. ఇక కృష్ణంరాజు కారణంగానే ప్రభాస్ ఈ సినిమాలో నటించిన ఒప్పుకున్నాడు.ఇక ఈ సినిమా విడుదలైన అనంతరం ఈ సినిమా రిజల్ట్ ని చూసి కృష్ణంరాజు సైతం షాక్ అయ్యాడు.ఇక ప్రస్తుతం ప్రభాస్ సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కే వంటి భారీ పాన్ ఇండియా సినిమాలతో బిజీగా వున్నాడు.!!