ప్రతి సినిమాకి కూడా డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ ప్రత్యేకత చాటుకుంటుంటాడు సూర్య. సూర్య తమిళ హీరో అయినా టాలీవుడ్లో కూడా ఆయనకి భారీగా అభిమానులు ఉన్నారు.తాజాగా 'ఆకాశం నీ హద్దురా' సినిమాతో నేషనల్ లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈ స్టార్ హీరో మాస్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో ఓ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇంకా పేరు కూడా కన్ఫర్మ్ కాని ఈ సినిమా 'Suriya 42'గా ప్రచారంలో ఉంది. ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కూడా భారీ మొత్తానికి అమ్ముడుపోయాయి.ఇక ఈ సినిమా డిజిటల్ ఇంకా శాటిలైట్‌తో పాటు హిందీ రైట్స్ ఏకంగా రూ.100కోట్లకు అమ్ముడుపోయాయనే వార్త కోలీవుడ్‌లో తెగ వైరల్ అవుతుంది. సినిమా షూటింగ్ పూర్తికాక ముందే రైట్స్ ఈ స్థాయిలో అమ్ముడుకావడం వైరల్ గా మారింది.ఇది పూర్తిగా సూర్య కి వున్న క్రేజ్ అనే చెప్పాలి.
ఇక ఈ సినిమాలో సూర్య సరసన దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటి దాకా 60 శాతం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా మిగతా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈమధ్యే గోవాలో కొన్ని మెయిన్ సీన్స్ ని చిత్రీకరించారు. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకులను అలరించనుంది. ఏకంగా పది భాషల్లో త్రీడీ ఫార్మాట్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను వంశీ, ప్రమోద్ నిర్మాతలుగా స్టూడియో గ్రీన్ ఇంకా యు.వి క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.మరి చూడాలి ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధిస్తుందో ఇంకా ఎన్ని రికార్డులు బద్ధలు కొడుతుందో..వరుస హిట్లతో దూసుకుపోతున్న సూర్య ఈ సినిమాతో కూడా ఖచ్చితంగా హిట్ కొట్టడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.