కన్నడ హీరో యష్ 'కేజీఎఫ్' అనే సినిమాతో ఓవర్ నైట్ స్టార్ట్ అయిపోయిన విషయం తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో రికార్డులను క్రియేట్ చేసి పాన్ ఇండియా హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో యష్ అన్ని ఇండస్ట్రీలోనూ ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత కేజిఎఫ్ 2 తో బ్లాక్ మాస్టర్ హిట్ అందుకొని అందరి ఫేవరేట్ గా మారిపోయాడు. ఇదిలా ఉంటే తాజాగా కన్నడ హీరో యష్ కి పెళ్లి సందడి బ్యూటీ శ్రీ లీల కి మధ్య బంధుత్వం ఉందని సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ వీళ్లిద్దరి మధ్య ఉన్న బంధుత్వం ఏంటనే విషయంలోకి వెళ్తే.. తెలుగులో పెళ్లి సందడి అనే సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది శ్రీలీల.
మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. అయితే శ్రీలీల తల్లి ఒక డాక్టర్. అందుకే తాను కూడా డాక్టర్ అవ్వాలని ఎంబిబిఎస్ చదువుతోంది. ఈమధ్య ధమాకా ప్రమోషన్స్ ఓవైపు చేస్తూ మరోవైపు ఎగ్జామ్స్ కూడా రాసిందట. అయితే శ్రీలీలకు సినీ బ్యాగ్రౌండ్ ఉన్నందునే ఆమెకి వరుస అవకాశాలు వస్తున్నాయని సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. ఈ క్రమంలోనే తాజాగా శ్రీలీల.. కేజీఎఫ్ హీరో యశ్ కి తనకి మధ్య ఉన్న బంధుత్వం గురించి చెప్పుకొచ్చింది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.." నాకు కన్నడ హీరో యశ్ కి ఎటువంటి సంబంధం లేదు. కాకపోతే యశ్ గారి భార్య రాధికకు మా అమ్మే స్వయంగా డెలివరీ చేసింది.
ఈ విషయాన్నీ పట్టుకొని మా ఇద్దరి మధ్య ఏదో రిలేషన్ ఉందని.. నా వెనక సినీ బ్యాగ్రౌండ్ ఉందని.. అందుకే నాకు అవకాశాలు వస్తున్నాయని ఏవేవో చెబుతున్నారు.
అసలు మా ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదు. కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే ఉంది. అది కూడా మా అమ్మగారు యష్ వాళ్ళ భార్యకి డెలివరీ చేయడం వల్ల ఫ్రెండ్షిప్ పెరిగింది. అలాగే నేను యశ్ గారిని భావా అని పిలుస్తాను. వాళ్ళ భార్యను అక్క అని పిలుస్తాను. అంతేకానీ మా మధ్య బ్లడ్ రిలేషన్ ఏం లేదంటూ శ్రీల క్లారిటీ ఇచ్చింది. ఇక తాజాగా ఈ అమ్మడు ధమాకా మూవీ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. డిసెంబర్ 23న విడుదలైన ఈ సినిమా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకొని కలెక్షన్స్ లో సైతం రికార్డ్స్ తిరగరాస్తోంది. ఇప్పటికే ఈ సినిమా 100 కోట్ల క్లబ్ కి చేరువైనట్లు సమాచారం...!!