తాజాగా నటసింహం నందమూరి
బాలకృష్ణ మరియు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహారెడ్డి
సినిమా రానున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో రానున్న ఈ
సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఇందులో భాగంగానే ఈ సంబంధించిన ట్రైలర్ ని ఈనెల ఆరవ తేదీన రిలీజ్ చేస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన
తమన్ ఈ
సినిమా ట్రైలర్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తన సోషల్
మీడియా వేదికగా చెప్పుకొచ్చాడు. ఇందులో భాగంగానే ఆయన మాట్లాడుతూ..
ఇప్పుడే
బాలయ్య వీరసింహారెడ్డి
సినిమా ట్రైలర్ను చూశానని..జనవరి 6న ఫైర్ ఫైర్ ఫైర్ జై
బాలయ్య అంటూ
తమన్ చెప్పుకొచ్చాడు. అయితే
తమన్ ఈ పోస్టును షేర్ చేసిన కొద్ది సమయంలోనే 16 వేలకు పైగా లైక్స్ రావడం జరిగింది. దీంతో వీరిద్దరి కాంబినేషన్ లో రానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.అయితే ఇప్పటికే అఖండ సినిమాతో మంచి హిట్ ను అందుకున్న
తమన్ ఈ సినిమాతో కూడా మంచి
సక్సెస్ ను అందుకుంటాడు అని భావిస్తున్నారు.దీంతో వీర సింహారెడ్డి సినిమాలోని పాటలతో
తమన్ మరోసారి
బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయాలి అని అభిమానులు భావిస్తున్నారు.
ఇటీవల
బాలకృష్ణ నటించిన ఆఖండ
సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో వీర సింహారెడ్డి
సినిమా కూడా అంతటి
సక్సెస్ ని అందుకుంటుంది అని భావిస్తున్నారు నందమూరి అభిమానులు. ఇక
బాలయ్య హీరోగా నటిస్తున్న వీరసింహారెడ్డి సినిమాలో బాలయ్యకు జోడిగా
శృతిహాసన్ నటించినా ఇప్పటికే ఈ
సినిమా నుండి విడుదలైన పాటలు, టీజర్ లు మంచి రెస్పాన్స్ ను అందుకున్నాయి. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో భాగంగా చాలామంది నందమూరి అభిమానులు
బాలయ్య సినిమా వస్తేనే మా అందరికీ
సంక్రాంతి పండుగ వస్తుంది అని అంటున్నారు..!!