నందమూరి నట సింహం బాలకృష్ణ తాజాగా వీర సింహా రెడ్డి అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా ... వరలక్ష్మి శరత్ కుమార్ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించింది. దునియా విజయ్ ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించగా ... తమన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. హనీ రోజి ఈ మూవీ లో మరో కీలకమైన పాత్రలో కనిపించబోతుంది.
ఈ మూవీ లో బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నట్లు సమాచారం. ఒక పాత్రలో బాలకృష్ణ ... బాల సింహా రెడ్డి గాను ... మరో పాత్రలో వీర సింహా రెడ్డి గారు కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు పాత్రల్లోనూ అద్భుతమైన వేరియేషన్స్ ను బాలకృష్ణ చూపించినట్లు విశ్వసినీయ వర్గాల నుండి సమాచారం. ఈ మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.
అందులో భాగంగా ఈ మూవీ ని యూఎస్ఏ లో కూడా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ లు కూడా యూఎస్ఏ లో ఓపెన్ అయ్యాయి. అందులో భాగంగా వీర సింహా రెడ్డి మూవీ ని యూఎస్ఏ లో 115 లొకేషన్ లలో ... 278 షో స్ వేయనున్నారు. ఇప్పటికే ఈ మూవీ కి యూఎస్ఏ లో అద్భుతమైన ఫ్రీ బుకింగ్ సేల్స్ ను అందుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.