ఇటీవల విడుదలైన పుష్పా సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకుంది రష్మిక మందన. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది ఈమె. అయితే తాజాగా ఈమె నటించిన వారిసు మరియు మిషన్ మజ్ను సినిమాల విడుదల సందర్భంగా పలు ఇంటర్వ్యూలు మరియు ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్లలో పాల్గొంటుంది రష్మిక. ఇంటర్వ్యూలో భాగంగా సమంత గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలను చేసింది రష్మిక. ఈ నేపథ్యంలోనే సమంత గురించి మాట్లాడుతూ.." సాంమయోసైటిస్ అనే ఒక అర్థమైన వ్యాధితో బాధపడుతుంది అని ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే..
సమంత ఒక అద్భుతమైన లేడీ.. తనకి అందరి పట్ల ఎంతో దయ కలిగి ఉంటుంది.. తను చాలా అందమైన ఒక మనిషి.. నేను ఎప్పటికీ తనని ఒక అమ్మ లాగా సంరక్షించాలనుకుంటున్నాను.. అంతేకాదు సమంత మయోసైటిస్ గురించి ప్రకటించిన తరువాతే నాకు కూడా తనకి అలాంటి ఒక వ్యాధి ఉంది అని తెలిసింది.. మేమిద్దరం అంతకుముందు చాలాసార్లు కలిసాము.. అయినప్పటికీ ఆ విషయాల గురించి నా దగ్గర ఎప్పుడూ ప్రస్తావించలేదు.. సమంత తన జీవితంలో ఎన్నో సవాళ్లతో పోరాడి ఈ స్థాయిలో సమంత ఉంది.. ఎంతోమంది తనని స్ఫూర్తిగా భావిస్తారు..
అందులో నేను కూడా ఒకరిని సమంతకి అంతా మంచే జరగాలి అని నేను కోరుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చింది రష్మిక.దాని అనంతరం విజయ్ దేవరకొండ గురించి కూడా మాట్లాడింది రష్మిక." "విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతానికి విజయ్ దేవరకొండ తో నేను ఈ సినిమా చేయడం లేదు.. ఈ ఏడాది లేదా వచ్చేయడాదైనా విజయ్ దేవరకొండ తో కలిసి నటించాలని కోరుకుంటున్నాను.. అంతేకాదు మా ఇద్దరినీ కలిసి నటిస్తే చూడాలని చాలామంది వెయిట్ చేస్తున్నారు.. వారి కోసం అయినా మేము త్వరలోనే కచ్చితంగా ఒక సినిమా చేస్తాము అంటూ చెప్పుకొచ్చింది. మా ఇద్దరికీ సెట్ అయ్యే కథ కోసం ఎదురు చూస్తున్నాం కథ నచ్చితే వెంటనే సినిమా చేస్తాము.. విజయ్ దేవరకొండ తో నటించాలని నేను ఎంతో వెయిట్ చేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది..!!