హోంబులే ఫిల్మ్స్ సంస్థ అధినేత విజయ్ కరిగందర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హోంబులే ఫిల్మ్స్ సంస్థ కన్నడ సినిమా అయినటువంటి కే జీ ఎఫ్ మూవీ తో దేశ వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఈ మూవీ లో యాష్ హీరో గా నటించగా ... శ్రీ నిధి శెట్టి ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది.
ప్రశాంత్ నీల్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. మామూలు అంచనాల నడుమ విడుదల అయిన కే జి ఎఫ్ చాప్టర్ 1 మూవీ ఇండియా వ్యాప్తంగా భారీ బ్లాక్ బాస్టర్ విజయం సాధించడంతో కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగి పోయాయి. అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ కూడా భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఈ మూవీ లను నిర్మించిన హోంబులే ఫిల్మ్స్ బ్యానర్ క్రేజ్ కూడా ఇండియా వ్యాప్తంగా పెరిగిపోయింది.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సంస్థ కాంతారా మూవీ ని నిర్మించింది. ఈ మూవీ కూడా ఇండియా వ్యాప్తంగా బ్లాక్ బాస్టర్ విజయం సాధించడంతో ఈ మూవీ నిర్మాణ సంస్థ క్రేజ్ మరింత గా పెరిగి పోయింది. ఈ మూవీ తెలుగు లో కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఈ మూవీ లో రిషబ్ శెట్టి హీరోగా నటించాడు. ఈ మూవీ లో రిషబ్ శెట్టి హీరోగా నటించిన మాత్రమే కాకుండా ... ఈ మూవీ కి దర్శకత్వం కూడా వహించాడు. ఇది ఇలా ఉంటే తాజాగా హోంబులే ఫిలిమ్స్ అధినేత విజయ్ కరిగందర్ ఒక సంచలన ప్రకటన చేశాడు. రానున్న 5 సంవత్సరాలలో 3 వేల కోట్ల పెట్టుబడి సినిమాలను నిర్మించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇలా ఈ నిర్మాత తాజాగా సంచలన ప్రకటన చేశాడు.