సంక్రాంతి కానుకగా ప్రభాస్ అభిమానులకు శుభవార్త..!
ప్రస్తుతం ఈయన సలార్, ప్రాజెక్టుకే, ఆది పురుష్ వంటి సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఒకవైపు సినిమాలలో బిజీగా ఉన్నా.. మరొకవైపు బాలయ్య కోరిక మేరకు.. ఆయన పైన గౌరవంతో ఆహాలో నిర్వహిస్తున్న సెలబ్రిటీ టాక్ షో కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ కూడా బాగా వైరల్ అవుతుంది. ఇదిలా ఉండగా ప్రభాస్ సినిమాల గురించి అప్డేట్ ఎప్పుడు వస్తుందని అభిమానులు తెగ ఆత్రుతగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సలార్ సినిమా నుంచి సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది అప్డేట్ రానుందని సమాచారం.
ఈ సినిమా నుంచి టీజర్ ను సంక్రాంతి కానుకగా జనవరిలో రివీల్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలువురు చెబుతున్నారు. మరి ఈ విషయంపై చిత్రం యూనిట్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఇకపోతే కేజిఎఫ్ 2 సినిమాతో భారీ పాపులారిటీని దక్కించుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇప్పుడు ప్రభాస్ తో సినిమా చేస్తున్నాడు. మరి ఈ సినిమాపై ఇప్పుడు భారీ అంచనాలు నెలకొన్నాయి ఇందులో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా హిట్టయితే ఈమె కూడా పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయినట్టే. హోం భలే ఫిలిమ్స్ పతాకం పై విజయ్ కిరంగదూర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.