తన స్టార్ డంను మళ్లీ నిరూపించుకున్న పవన్ కళ్యాణ్..!

Divya
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఏ రేంజ్ లో పాపులారిటీ దక్కించుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన పవన్ కళ్యాణ్ అనతి కాలంలోనే సుస్వాగతం, బద్రి, గుడుంబా శంకర్, అత్తారింటికి దారేది వంటి చిత్రాల ద్వారా తన పాపులారిటీని మరింత పదిలం చేసుకున్నాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా వకీల్ సాబ్ , భీమ్లా నాయక్ వంటి చిత్రాలతో కూడా భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈయన కేవలం లేటెస్ట్ సినిమాలతోనే కాదు రీ రిలీజ్ సినిమాలతో కూడా తన సత్తా చాటారు.
ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ గా నిలిచిన ఖుషి సినిమా 2003 ఏప్రిల్ లో విడుదలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమాను ఇప్పుడు రీ రిలీజ్ చేయడం జరిగింది.  ఈ సందర్భంగా డిసెంబర్ 31వ తేదీన 4కే రూపంలో ఎన్నో థియేటర్లలో ఖుషి సినిమాను రిలీజ్ చేయగా.. భారీ విజయంతో దూసుకుపోతోంది. అంతేకాదు రీ రిలీజ్ సినిమాతో కూడా పవన్ కళ్యాణ్ తన స్టార్ డం n నిరూపించుకోవడంతో నిజంగా అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తోంది అని చెప్పాలి.
ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలలో బిజీగా ఉండగానే.. మరొకవైపు రాజకీయాలలో ఎలాగైనా సరే 2024 ఎన్నికలలో తన ప్రజారాజ్యం పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే నెపంతో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే తన ప్రసంగాలతో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్న పవన్ కళ్యాణ్ ఎలాగైనా సరే అధికారాన్ని తన చేతిలోకి తీసుకోవాలని భీష్ముంచుకు కూర్చున్నారని సమాచారం.  ఇకపోతే ప్రస్తుతం ఆయన డైరెక్టర్ క్రిష్  దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.  ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే పలు సినిమాల ద్వారా భారీ విజయాన్ని అందుకున్న పవన్ కళ్యాణ్.. ఇప్పుడు ఈ రీమేక్ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: