టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలను నటించి తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుంది కరాటే కళ్యాణి. సాధారణంగా ఈమె సినిమాల్లో ర్యాంప్ రూల్స్ ఎక్కువగా చేస్తుంది. అద్భుతమైన కామెడీతోపాటు ఈమె నటన అందరినీ ఆకట్టుకుంటుంది.దాదాపుగా 25 సినిమాల్లో ఈమె నటించింది. ముఖ్యంగా కృష్ణ, మిరపకాయ వంటి రవితేజ సినిమాల్లో ఈమె కామెడీకి చాలామంది ఫాన్స్ ఉన్నారు.అయితే ఇటీవల ఈమెకు సినిమా అవకాశాలు రాకపోవడంతో బిగ్ బాస్ సీజన్ ఫోర్ లోకి కూడా ఈమె రావడం జరిగింది.ఇక ఈ షో తో మరింత పాపులారిటీని అందుకుంది ఈమె.
దాని అనంతరం మా ఎలక్షన్స్ టైం లో ఈమె కి సంబంధించిన వార్తలు ఎన్ని రకాలుగా వచ్చాయో మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తను సినిమాల్లో నటించిన పాత్ర వల్ల తనకి వ్యభిచారిని అని ఒక ముద్ర కూడా వచ్చింది అంటూ షాకింగ్ కామెంట్లను చేసింది కరాటే కళ్యాణి. ఇందులో భాగంగానే ఆమె మాట్లాడుతూ బతుకుతెరువు కోసం మాత్రమే నేను సినిమాల్లో నటిస్తున్నాను అని.. అందుకే నాకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాను అని.. చాలామంది నేను బావి డైలాగ్ తో బాగా ఫేమస్ అయ్యాను అని అంటూ ఉంటారని..
ఆ డైలాగు వల్లే నన్ను ఇప్పుడు చాలామంది గుర్తు పడుతున్నారు అని.. చెప్పుకొచ్చింది. నాలో యాక్టరే కాదు నాలో ఒక మంచి కోణం కూడా ఉంది. నా జీవితంలో నేను చాలామందికి సహాయం చేశాను. నేను సహాయం చేసిన వారందరూ నన్ను ఎంతో గౌరవిస్తారు. కానీ సినిమాల్లో నేను నటించిన కొన్ని పాత్రల వల్ల నాకు వ్యభిచారిని అని ఒక ముద్రనూ వేశారని.. అందరూ నన్ను అలాగే చూస్తారు అంటూ బాధపడింది కరాటే కళ్యాణి. దీంతో ఈమె చేసిన ఈ వ్యాఖ్యలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి ..!!