దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జూనియర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ఈ సినిమా లోని పాటలు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకున్నాయో మనందరికీ తెలిసిందే. ఇక త్రిబుల్ ఆర్ సినిమా విజయంలో కీరవాణి పాత్ర కూడా ఎంతో ఉంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ సినిమాలోని పాటలతో ఈ సినిమాకి మరింత బలం వచ్చింది. ఇక ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ల కార్యక్రమాలలో భాగంగా రాజమౌళి మాట్లాడుతూ
తన సినిమాకు బలం తన పెద్దన్న కీరవాణి సంగీతమే అని చాలాసార్లు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. తన విజయానికి కారణం కీరవాణి అంటూ కూడా చెప్పుకొచ్చాడు. తన సినిమాలకి పర్ఫెక్ట్ మ్యూజిక్ ని కంపోజ్ చేస్తాడని.. ఒక్కోసారి ఆయన సంగీతానికి తగ్గ సీన్లను కూడా రాజమౌళి డిజైన్ చేసుకుంటాడు అని.. ఆయన చాలా సందర్భాలలో చెప్పడం జరిగింది. ఈ సినిమాలో చాలా సింపుల్ సీన్స్ ఉన్నాయి కానీ కీరవాణి తన మ్యూజిక్ తో ఆ సీన్లను ఎంతగా హైలెట్ చేశాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈ సినిమాతో దర్శకుడిగా రాజమౌళి ఎంత సక్సెస్ను అందుకున్నాడో ఈ సినిమా
సంగీత దర్శకుడిగా కూడా కీరవాణి అంతే గుర్తింపును పొందాడు అనడంలో ఇలాంటి సందేహం లేదు. ఇక ఈ సినిమాలోని నాటు నాటు పాటకి ఎన్ని అవార్డులు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈ పాట ఇంత పర్ఫెక్ట్ గా రావడానికి కీరవాణి పెద్ద యుద్ధమే చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ పాట ఇంత పర్ఫెక్ట్ గా రావడానికి రాజమౌళి కి ఏకంగా 20 ట్యూన్ లను వినిపించాడట కీరవాణి. ఇక ఈ పాట లిరిక్స్ ని రాయడానికి చంద్రబోస్ కు ఏకంగా 19 నెలలకు పైగానే సమయం పట్టినట్లుగా తెలుస్తుంది. దాని అనంతరం ఈ పాట షూటింగ్ సమయంలో చంద్రబోస్ కు ఫోన్ చేసి చివరి రెండు లైన్లను మార్చమని చెప్పాడట కీరవాణి. ఆఖరిగా ఈ పాటను షూట్ చేయడానికి 17 టేకులను తీసుకోవడం జరిగిందట. ఈ అంతటి కష్టానికి ఫలితంగా ఈ పాట అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును పొందింది..!!